ధోని, కోహ్లీలపై సంచలన వ్యాఖ్యలు

ముంబయి: తన కుమారుడిని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీలు వెన్నుపోటు పొడిచారని యోగ్ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ కష్ట కాలంలో ఉన్నపుడు వీరీద్దరు అండగా నిలిచేందుకు ముందుకు రాలేదని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా యోగరాజ్ ఇలా ఆరోపణలు చేయండం ఇది మొదటిసారి కాదు . గతంలో పలుమార్లు ధోని, కోహ్లీలపై ఆరోపణలు గుప్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/