ధూమపానం నిషేధంలో ద్వంద్వవైఖరి ఇంకెన్నాళ్లు?

               ధూమపానం నిషేధంలో ద్వంద్వవైఖరి ఇంకెన్నాళ్లు?

 

Smokingin Public Places
Smokingin Public Places

ఆగ్నేయాసియాలో గంటకు నూటయాభై మంది వరకు కేవలం పొగాకు వినియోగం వల్లనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తర్వాత కూడా పొగాకు సాగును ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం. అయితే పొగాకు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ఒకపక్క ప్రయత్నాలు చేస్తూనే మరొకపక్క సాగును ప్రోత్సహించడం ఏమేరకు సమంజసమో పాలకులు ఆలోచించాలి. ఇటీవల పొగాకు రైతులతో కొందరు పాలకపక్షపెద్దలు మాట్లాడుతూ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే వైపు చర్యలు చేపట్టి సాగును ప్రోత్సహిస్తామని పరోక్షంగా చెప్పారు. ఇంకొక పక్క పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి ఉత్పత్తుల డబ్బాలపై ఆరోగ్యకరమైన హెచ్చరికలు చేస్తున్నారు. వాస్తవంగా ఆగ్నేయాసియాలో పదకొండు దేశాల్లో ఇరవైనాలుగున్నర కోట్ల మంది ధూమపానం చేస్తున్నారని, ఇరవై తొమ్మిది కోట్ల మంది పొగాకను ధూమపానేతర ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడైంది. మరొకపక్క పొగాకు వినియోగం వల్ల పద్దెనిమిది లక్షల మంది ఏటా మరణిస్తున్నట్లు అదే అధ్యయనంలో వెల్లడించింది. భారతదేశంలో వయోజనుల్లో 35 శాతం మంది పొగాకును ఏదో ఒకరూపంలో వినియోగిస్తున్నట్లు మరొక సర్వే సంస్థ స్పష్టం చేసింది. పొగాకు వినియోగం వల్ల మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సోకుతున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ ఏనాటి నుంచో చెప్తూనే ఉంది.

పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు గత రెండుమూడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం కొన్ని చట్టాలను కూడా చేసింది. మానవ జాతిని పట్టిపీడిస్తున్న భూతాలు ఈధూమపానం, మద్యపానం అనేది అందరికీ తెలిసిందే. మద్యపానాన్ని పెంచిపోషిస్తూ ఆదాయవనరుగా మలచుకుంటున్న పాలకులు ధూమపానం విషయంలో ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారేమోననిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల మందికిపైగా ధూమపానంలో మునిగితేలుతున్నట్లు అధికార అంచనాలు వెల్లడిచేస్తున్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకు దాదాపు ఇరవై కోట్ల మందికిపైగా పొగాకు అలవాటుపడ్డారు. బీడీలు, సిగరెట్లుతాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతున్నది. పదిహేనేళ్లలోపు వయసు వారు కూడా ఈ బీడీలు, సిగరెట్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇందువల్ల రోగాల పాలవ్ఞతుంటే లక్షలాది మంది అసువ్ఞలు బాస్తున్నారు. సిగరెట్‌పొగలో 4,800లకుపైగా విషవాయువ్ఞలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది అనేక రోగాకలు కారణమవ్ఞతున్నాయి. అందుకే పొగాకును పారదోలేందుకు తీసుకుంటున్న చర్యలను స్వాగతించాల్సిందే. కానీ ఇందువల్ల జీవనోపాధి కోల్పోతున్న వారి గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం.

గతంలో బీడీ కట్టల మీద భయం కొల్పే పుర్రె బొమ్మలను ముద్రించాలని ఉత్తర్వులు జారీ చేయడం, 60 శాతం ఉండాలని నిబంధనలు విధించడంతో లక్షలాది మంది బీడీ కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జీవనోపాధి కోల్పోతున్నామని ఆందోళనకు దిగారు. బీడీ పరిశ్రమంగా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో కోట్లాది మందికి బతుకుతెరువ్ఞ ఇస్తుందనేది కాదనలేని వాస్తవం. అలాగే అడవ్ఞల్లో ఉన్న లక్షలాది మంది గిరిజన కుటుంబాలకు బీడీ ఆకుల సేకరణ ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి. కొన్ని శతాబ్దాలుగా అది ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్నది. ఇక పొగాకు ఉత్పత్తుపలై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవనంసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైగా పొగాకు వ్యాపారం జరుగుతున్నదని అంచనా. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఖమ్మం, ఆదిలాబాద్‌, గుంటూరు,కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పొగాకును విస్తారంగానే పండిస్తున్నారు. వాస్తవంగా చూస్తే పొగాకును రైతులతో సాగు చేయించేందుకు వారికి ప్రోత్సాహాలు ఇచ్చి పెంచి పోషించారు. ఎక్కడికక్కడ పొగాకు బ్యారన్లు వెలిశాయి. రైతులతోపాటు మరెంతో మంది రైతు కూలీలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఈ కుటుంబాలు వీధిపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి ముందు ప్రత్యామ్నాయం చూపకుండా అవేమి పట్టించుకోకుండా కాగితాలపై చట్టాన్ని చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం మరో విషయాన్ని విస్మరిస్తున్నది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు ఏటా వసూలు చేసుకుంటున్నది. ఈ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సులు ఇస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. దేవాలయాల ముందు, పాఠశాలల ముందు ఒక్కచోటేమిటి మంచి నీళ్లు దొరకని గ్రామాలు దొరకని గ్రామాలున్నా యేమోకానీ బీడీలు, సిగరెట్లు దొరకని గ్రామాలు దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒకపక్క ఆదాయం కోసం లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరో పక్క నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాలకులకు చిత్తశుద్ధి వ్ఞంటే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను, వినియోగాన్ని భూటాన్‌ దేశం లో లాగా పూర్తిగా నిషేధించాలి. అంతకంటే ముందు జీవనోపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపాలి.
– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌