ధవళేశ్వరం వద్ద భారీగా పెరిగిన నీటిమట్టం

dhwaleshwara barrage
dhwaleshwara barrage

 

 

రాజమహేంద్రవరం నగరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 8.20 అడుగులకు చేరుకుంది. దీంతో ఆ బ్యారీజి అన్ని గేట్లను ఎత్తి 6,02,879 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద 38.1 అడుగల వద్ద నీటిప్రవాహం కొనసాగుతుంది. దీంతో మరింత వరద ధవళేశ్వరానికి చేరే అవకాశముంది. అలాగే డెల్డాలకు7100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.