ధర్నా వేదిక నుండే ప్రభుత్వాని నడుపుతాను

Mamata
Mamata

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా చెనర్జీ అన్నారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే కానీ, సీబీఐ కాదన్నారు. కేంద్ర సంస్థల బాధితురాలిగా రాష్ట్రం మారుతోందంటూ మండిపడ్డారు. కోల్‌కతాలో ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరుతో ధర్నా సాగిస్తున్న మమతా బెనర్జీ…అదే వేదిక నుంచి కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై మండిపడ్డారు.ధర్నా వేదక నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని మమత చెప్పారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలను కేంద్రం ఉసి గొలుపుతూ ప్రజాస్వామ్యాన్ని కళంకిత చేస్తోందన్నారు. ప్రజలను భయపట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ధర్నా వేదిక నుంచి కదలేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకూ ధర్నా కొనసాగించాలని మమత ఆలోచనగా తెలుస్తోంది.