ధరలు తగ్గించిన శాంసంగ్‌

SAMSUNG1=
SAMSUNG

ధరలు తగ్గించిన శాంసంగ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 3: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ తన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గించింది.గెలాక్సీ జే7ఫ్రైమ్‌,గెలాక్సీ జె5 ప్రైమ్‌ లపై ధర తగ్గిస్తున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది. తగ్గించిన ధరల ప్రకారం 18,790గా ఉన్న శాం సంగ్‌ గెలాక్సీ జె 7 ప్రెమ్‌ ధర 14,900లకు దిగొచ్చింది. అదే విధంగా గెలాక్సీ జె5 ప్రైమ్‌పై 1800 ధర కోత పెట్టిన శాంసంగ్‌,ఈ ఫోన్‌ను కూడా 12,990 రూపాయలకే విక్రయానికి తీసు కొచ్చింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గత సంవత్స రం సెప్టెంబరులో మార్కెట్‌లోకి వచ్చాయి. గెలా క్సీ జె7 ఫీచర్లు 5.50 అంగుళాల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్‌ అక్టా-కోర్‌ ప్రొసెసర్‌,ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో,3 జిబి ర్యామ్‌,16బిజి స్టోరేజ్‌,256 బిజి వరకు విస్తరణ మెమెరీ,13 ఎంపి రియర్‌ కెమెరా,8 ఎంపి ఫ్రంట్‌ కెమెరా,3300 ఎంఎ హెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌. గెలాక్సీ జె5 ప్రైమ్‌ ఫీచర్లు5.00 అంగుళాల డిస్‌ప్లే,1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌,ఆండ్రాయిడ్‌ 6.0 ఓఎస్‌,2 జిబి ర్యామ్‌,16 జిబి స్టోరేజ్‌,256 జిఇ వరకు విస్తరణ మెమెరీ,5 ఎంపి ఫ్రంట్‌ కెమెరా, 2400ఎంఎహెచ్‌ బ్యాటరీ,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌.