‘ధన దాహాన్ని తీర్చడానికే కాళేశ్వరం’

KODANDARAM
KODANDARAM

‘ధన దాహాన్ని తీర్చడానికే కాళేశ్వరం’

కాళేశ్వరం ఎత్తిపోతల రీడిజైన్‌పై నిపుణుల ఆగ్రహం
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పలు పార్టీల నేతలు
తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం : ఉత్తమ్‌
తెలంగాణ మొత్తానికి నీరు వస్తాయనేది పెద్ద అబద్ధం : కోదండరాం
జనాల నెత్తిన భరించలేనంత భారం వేస్తే ఎవ్వరూ ఊరుకోరు : రేవంత్‌

పంజాగుట్ట (హైదరాబాద్‌) : కాళేశ్వరం ఎత్తి పోతల ప్రాజెక్టులాభమా..నష్టమా అన్న అంశంపై తెలంగాణ జెఎసి చైర్మన్‌ రఘు హైదరాబాద్‌లో ఆదివారంనాడు రౌండ్‌టేబుల్‌సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు,మేధావ్ఞలు, సాగు నీటిరంగ నిప్ఞణలు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని తాకట్టుపెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్‌ అప్ఞ్పలు చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌కు రాష్ట్రపతికి రెప్రజెంటేషన్‌ ఇవ్వాలి. 152 మీటర్ల తెలంగాణలో లక్షల ఎకరాలు ముంచేందుకు సిద్ధమయ్యారు. 1800 ఎకరాల ముంప్ఞపై సమాధానంఇవ్వలేని కెసిఆర్‌ ప్రజలకు తీరని తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై నిప్ఞ్పలుచెరిగారు. ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుందో ఇప్పటివరకు బయటపెట్ట లేదు.

బ్యాంకుల్లో ఏం తాకట్టుపెట్టి అప్ఞ్పలు తెస్తున్నారో చెప్పడంలేదు. రెండులక్షల కోట్ల టెండర్లను గ్లోబల్‌ టెండర్లను పిలిస్తే ప్రజల సోమ్ము 40వేల కోట్లు మిగిలేవి, తప్ఞ్పడు లెక్కలతో తెలంగాణ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లుగా తుమ్మడిహట్టిలోతట్టమట్టి ఎత్తిపోయని ప్రభుత్వం వార్దావద్ద ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తెస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

జనసమితి అధ్యక్షులు కోదండరాం.. అవసరానికి తగ్గట్టుగానే ప్రాజెక్టులు కడుతున్నారా అన్నది అనుమానంగానే ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఎల్లంపల్లి నుండి తెలంగాణ మొత్తానికి నీరు వస్తాయనేది పెద్ద అబద్దమని ఆయన వాఖ్యానించారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కనుమరుగైపోయాయని అన్నారు. ఎఊరికి వెళ్లినా ఎల్లంపల్లి నుండి మీకు నీరు వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుందన్నారు. హేతు బద్దంగా చర్చ జరిగితే సొల్యూషన్‌ వస్తుందని, ఎవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. వాస్తవాలు అడిగిన ప్రాజెక్టుకు అడ్డం పడు తున్నారని ప్రచారం చేస్తుతన్నారని కోదండరాం చెప్పారు. ఈ ప్రాజెక్టుతో వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌లకు కొంతవరకు నీరు అందుతాయోమో కానీ.. అన్ని ప్రాంతాలకు మాత్రం నాళ్లు రావని ఆయన చెప్పారు. ఏ ఎత్తులో నీరు ఆ ఎత్తులోనే పారేలాచూడాలి,లేదంటే భవిష్యత్తులో ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో కాళేశ్వరంప్రాజెక్టు ఉదాహ రణగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లు ప్రాజెక్టులకు డిజైన్లు చేస్తారా లేక ఇంజనీర్లు డిజైన్‌ చేస్తారా అలోచించాల న్నారు.