ధనిక దేశాల్లో అగ్రస్థానంలో స్వీడన్‌

SWEDEN
SWEDEN

ప్రపంచంలోని 27 ధనిక దేశాల గురించి సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌(సిజిడి) సంస్థ నివేదిక రూపొందించింది. ఈ సూచిలో అమెరికాకు 23వ స్థానం లభించింది. విదేశీ సాయం, ఆర్ధికాంశాలు, పర్యావరణ విధానాల వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది జాబితాలో స్వీడన్‌ అగ్రస్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో డెన్మార్క్‌, తృతీయ స్థానంలో జర్మనీ, ఫిన్లాండ్‌లు నిలిచాయి. ఈ సారి ర్యాంకుల్లో తొలి 12 స్థానాలను యూరోపియన్‌ దేశాలే పొందాయి.