ద‌ళితుల‌కు అన్యాయం చేసే వారిలో క‌డియం పాత్రః మంద‌కృష్ణ‌

Manda Krishna
Manda Krishna

హైద‌రాబాద్ః ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కొద్దిరోజుల క్రితం ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేయడం సుమారు ఆరు రోజులపాటు జైల్లో పెట్టారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం మందకృష్ణ తదుపరి కార్యాచరణను ప్రకటించారు.
జనవరి 2నుంచి ఉపవాస దీక్ష చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తే ఢిల్లీలో దీక్ష చేస్తామని ఆయన సర్కార్‌కు చెప్పాం కానీ టీఆర్ఎస్ నుంచి స్పందన రాలేదన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కడియం పారిపోయారని మందకృష్ణ వ్యాఖ్యానించారు. దళితులకు అన్యాయం చేసినవారిలో కడియం పాత్ర ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆరోపించారు. కడియం ప్రోత్సాహంతోనే మమ్మల్ని జైలుకు పంపారని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.