ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎంకు క‌విత లేఖ‌

Kavitha K
K. Kavitha

హైదరాబాద్ : అయ్యప్ప భక్తుల కోసం నిజమాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలును నడిపించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు లేఖరాశారు. వచ్చే నెల జనవరి 11న నిజామాబాద్ నుంచి శబరిమలకు.. జనవరి 16 వ తేదీన శబరిమల నుంచి నిజామాబాద్‌కు ప్రత్యేక రైలు నడిపించాలని కోరారు. నిజామాబాద్ నుంచి వేలాది మంది అయ్యప్పభక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు శబరిమలకు వెళతారని చెప్పారు. వీరి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.