ద్ర‌వ్య‌వినిమ‌య బిల్లుకు శాసనసభ ఆమోదం

ASSEMBLY
ASSEMBLY

హైద‌రాబాద్ః ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. ద్రవ్య వినిమయ బిల్లు-2018 (2018 ఎల్‌ఏ బిల్ నం.7)ను, ఆ తరువాత తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (నంబర్-2) (2018 ఎల్‌ఏ బిల్ నంబర్ 8) ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ అపొజిషన్ సభ్యులకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. సీఎం ప్రసంగం ముగిసిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో చట్టసభల్లో వార్షిక బడ్జెట్ (2018-19) కు ఆమోదం లభించింది.