ద్రవిడనాడు ప్రతిపాదన వస్తే స్వాగతిస్తా

STALLIN
Stallin

చెన్నై: ద్రవిడనాడు ఆవిర్భావానికి అనువైన వాతావరణం ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవిడనాడు ఆవిర్భావాన్ని స్వాగతిస్తున్నామని డిఎంకె వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ పేర్కొన్నారు. దక్షిణాదిరాష్ట్రాలన్నీంటినీ కలిపి ద్రవిడనాడుగా ఏర్పాటుచేసే ప్రక్రియ వస్తే తాను స్వాగతిస్తామని ఈరోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదే కనుక జరిగితే తాను మరింత స్వాగతిస్తానని ఆయన అన్నారు. ద్రవిడనాడు ఏర్పాటుకు డిమాండ్‌కు స్టాలిన్‌ మద్దతునిచ్చాఉరు. ఆర్‌కెనగర్‌ ఎమ్మెల్యే టిటివిదినకరన్‌ ఈ అంశంపై విభేదించారు. డిఎంకెనాయకులు ఎంచుకున్న ఈ అంశం ఆచరణ సాధ్యం కాదని ఎక్కడా కూడా డిఎంకె ఈ ద్రవిడనాడు ఏర్పాటుకు సంబంధించి విజయం సాధించలేదని అన్నారు .ముందు కావేరి జలాలపై దృష్టిపెట్టాలని, ఇన్నేళ్లలో ఆయన ఏం చేశారని ఆయన అధికారంలో ఉన్నపుడు సైతం ఏమి చేయలేకోయారని, ఆయన తన పరపతిని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించాలని, ఇపుడిపుడే వస్తున్న ద్రవిడనాడుకంటే కావేరి జలాల వివాదం ముఖ్యమైనదని దినకరన్‌ వెల్లడించారు. అయితే దినకరన్‌ వ్యాఖ్యలపై స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. తాను మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చానని, వాటి అర్ధం తానుద్రవిడనాడుకు ప్రచారం చేస్తున్నట్లు కాదని అన్నారు. ద్రవిడనాడు ఏర్పాటుపై తాను మాట్లాడానని అయితే తనను ప్రశ్నించిన మీదట మాత్రమే తాను సమాధానాలు ఇచ్చానని, అంతేకానీ ద్రవిడనాడు ఏర్పాటుకు తాను ఎలాంటిప్రచారంచేస్తున్నట్లు కాదని ఆయన అన్నారు. తమిళ్‌, మళయాళం, తెలుగు, కన్నడ భాషలు మాట్లాడేవారందరినీ కలిపి ద్రవిడనాడుగా ఏర్పాటుచేయాలని ఇవి రామసామి పెరియార్‌ మొదటప్రతిపాదించారు. ఈ ప్రపతిపాదనపైనే ఆయన ద్రవిడభాషకు జాతీయ గుర్తింపును తెచ్చారు. ఆయన ద్రవిడార్‌కజగమ్‌ పార్టీని 1940లోనే స్థాపించారు. తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పార్టీ నిలిచింది. అయితే తమిళంతోపాటు ఇతర మూడు భాషలు మాట్లాడే రాష్ట్రాలు వేటికవి సొంతంగా కొనసాగుతున్న తరుణంలో ద్రవిడనాడుపేరిట ఈ నాలుగు రాష్ట్రాలను ఏకం చేయడం అనేది సాధ్యమయ్యే ప్రతిపాదన కాదని పలువురు తమిళులనుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.