దౌర్జన్య చర్యలపై అప్రమత్తత అవసరం

angry
angry

దౌర్జన్య చర్యలపై అప్రమత్తత అవసరం

పిల్లలు ఆడుకొనేటపుడు ఇతర సాంఘిక చర్యలలో కొంతవరకు దౌర్జన్యం చూపటం సహజం. కాని కొందరు పిల్లల్లో తరచుగా దీర్ఘకాలం పాటు అకారణ దౌర్జన్యం కనిపిస్తుంది. దానిని తల్లిదండ్రులు ఒక సమస్యగా గుర్తించి నియంత్రించడానికి ప్రయత్నించాలి. అటువంటి దౌర్జన్యశీలురైన పిల్లలతో స్నేహం చేయడానికి ఇతర పిల్లలు భయపడతారు. కనుక వాళ్ల సాంఘిక వికాసం దెబ్బతింటుంది. అధిక కోపం, ఇతర పిల్లలను నిష్కారణంగా కొరకటం, కొట్టడం, వ్యతిరేకవాదం, ఆటవస్తువ్ఞలను విసిరికొట్టి, ధ్వంసం చేయటం వంటి చర్యల ద్వారా పిల్లలు తమ దౌర్జన్యాన్ని వెలిబుచ్చుతారు. ఇటువంటి దౌర్జన్యాన్ని తల్లిదండ్రులు వెంటనే గమనించి వారిని మంచి మాటలతో తమ వశం చేసుకుని వాళ్ల చర్యలను అరికట్టాలి. ్పుుని వాళ్ల చర్యలను అరికట్టాలి.