దోషగుణాలు

JANAKA1
JANAKA MAHA RAJU, SADHUVU

దోషగుణాలు

జనక మహారాజుకు రాజర్షి అనే బిరుదు ఉందని మనందరికీ తెలుసు. ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల వ్యవహారాలలో మునిగితేలే రాజు జ్ఞాని ఎలా అయ్యాడు? అని మనకు సందేహం కలుగుతుంది. ఒక సాధువు నరుడు రాజర్షి, జ్ఞాని ఎలా అయ్యాడో తెలుసుకుందామనుకున్నాడు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్లాడు. ఆ సమయంలో జనకుడు, తన మంత్రులతో రాజవ్యవహారాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నాడు. పన్ను చెల్లించకుండా ఉన్న సామంతరాజుల మీద కోపం చూపుతున్నాడు. సింహాసనం మీద ఆసీనుడైన జనకుని పరిచారికులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఆయన కిరీటంలో పొదగబడిన మణులు, రత్నాలు, ధగధగ మెరుస్తున్నాయి. ఎటు చూసినా ఆడంబరం అట్టహాసంగా ఉంది. సాధువ్ఞ ఇదంతా గమనిస్తున్నాడు. అతనికి ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు.

ఇతడు అన్నీ లౌకిక విషయాలే చర్చిస్తున్నాడు. సిరిసంపదలతో తులతూగుతున్నాడు. ఇతడు రాజర్షి, జ్ఞాని ఎలా అవ్ఞతాడు? ఇతడిని జ్ఞాని అన్నవాళ్లు-అజ్ఞానులు అనుకున్నాడు. సాధువ్ఞ ఆస్థానంలోకి ప్రవేశించగానే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో చర్చిస్తూ అతనిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. అతని మనసులోని భావాలు, అంతర్దృష్టితో చూస్తున్నాడు. సాధువ్ఞను దగ్గరికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు.

నీవ్ఞ నిజమైన సాధువ్ఞ కాదు. నా విషయంలో ఆలోచిస్తూ ఉన్నావ్ఞ. అంతే కదా అన్నాడు. సాధువ్ఞ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ ఇతరుల తప్పులు ఎంచే స్వభావం నీది. నీ సమయమంతా దానితోనే గడిచిపోతోంది. ఇంక భగవధ్యానానికి నీకు తీరికేది? సాధువ్ఞ ఇంకా ఆశ్చర్యపడ్డాడు. నా దృష్టిలో నీవ్ఞ నేరస్తుడివి. రాజుగా నిన్ను శిక్షిస్తున్నాను. ఒక వారం రోజులలో నీకు ఉరిశిక్ష విధించబోతున్నాను. సాధువ్ఞ నిలువ్ఞనా వణికిపోతూ నిల్చున్నాడు. జనకుడు అలా ప్రకటించగానే భటులు సాధువ్ఞను తమ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చెరసాలకు తరలించారు. అతనికి రోజూ ఉప్పు లేని కూరలు, కారం కలిపిన తీపి పదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులకు ఆదేశించాడు. అయితే సాధువ్ఞ వాటి రుచిని పట్టించుకునే స్థితిలో లేడు. కళ్లు మూసినా తెరిచినా ఎదురుగా ఉరికంబమే కనిపిస్తోంది. తనమెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుకుంటున్న దృశ్యమే కళ్లముందు కదలా డుతోంది. ఆవారం రోజులు ఆతడు మనోవ్యధతో చిక్కి శల్యమయ్యాడు. ప్రాణాలు కళ్లలోకి వచ్చాయి. ఏడవరోజున జనకుడు సాధువ్ఞని ఉరితీయవలసిందిగా భటులకు ఆజ్ఞాపించాడు. తను కూడా ఉరితీసే స్థలానికి వెళ్లాడు. భటులు చెరొక వైపు సాధువ్ఞ చేతులు పట్టుకుని అతికష్టం మీద అడుగులు వేస్తున్న అతనిని తీసుకుని వచ్చి జనకుని ముందు నిలబెట్టారు మృత్యుభయంతో. సాధువ్ఞ స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు.

కొంచెం సేపటికి స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆజ్ఞ ప్రకారం సేవకులు అతనికి ఉప్పు కలిపిన పాలను గ్లాసు లో పోసి అందించారు. సాధువ్ఞ ఆ పాలను గుటగుట త్రాగేశాడు. జనకుడు చిరునవ్ఞ్వతో చూస్తూ పంచదార సరిపోయిందా, రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించాడు. వెంటనే సాధువ్ఞ ఎందుకు అడుగుతారు మహారాజా! ఈ వారం రోజులు పదార్థాల రుచి గమనించే స్థితిలో లేను.

నాకు ప్రతి క్షణమూ కన్నుమూసినా తెరిచినా ఉరికంబమే కనబడుతోంది అంటాడు తలవంచుకుని వినయంగా. జ్ఞానబోధకు ఇది మంచి సమయమనుకుంటాడు జనకమహర్షి. ఈవారం రోజులూ నీవ్ఞ ఏం చేస్తున్నా, ఏం భుజిస్తున్నా, నీ దృష్టి అంతా తింటున్న వాటిమీద లేనేలేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను ఉదయం నుంచి రాత్రి వరకు లౌకిక కార్యాలు నెరవేరుస్తున్నా, నా దృష్టిమాత్రం ఎల్లప్పుడూ పరబ్రహ్మం మీదే లగ్నమై ఉంది. విశేష ధ్యానం వలన నేనా స్థితిని సాధించ గలిగాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే, లోక వ్యవహారాలకు అతీతంగా కూడా ఉండగలను. నా మనఃస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఇక ముందు ఎప్పుడూ కూడా ఇతరుల దోషగుణాలు ఎంచే ప్రయత్నం చేయవద్దు. నీబాగు, నీ దైవభక్తి నీవ్ఞ పెంపొందించుకో. ఇతరులలో ఉండే మంచి గుణాల్నే చూడటం నేర్చుకో. తపస్సుతో, ధ్యానంతో, పరమసత్యం తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూ ప్రపంచ క్షేమంకోసం పనిచెయ్యి. ఇక వెళ్లు అంటాడు రాజు. సాధువుకు, జనకమహర్షి ఉన్నత స్వభావం తన అల్పగుణం అర్థం చేసుకుంటాడు.
శిరస్సు వంచి వినయంతో రాజుకి నమస్కరించి అక్కడి నుంచి కదలిపోతాడు.

– ఉలాపు బాలకేశవులు