‘దోమా’ధీనంగా ప్రజారోగ్యం

Patients
Patients

‘దోమా’ధీనంగా ప్రజారోగ్యం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ ఊహించని రీతిలో పురోగమిస్తున్న మానవాళి దోమపై పోరులో మాత్రం వెనుకబడిపోతు న్నారు. దోమ నివారణ విషయంలో దశాబ్దాలుగా నిర్ల క్ష్యం, చేతకాని తనం, వీటన్నింటిని మించి అవినీతితో పాలకవర్గం చతికిలపడి పోతున్నదేమోననిపిస్తున్నది. సీజన్‌ మారినప్పుడల్లా దోమలు విజృంభించడంతో రక రకాల వ్యాధులు ప్రబలిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పరి స్థితి రానురాను ఆందోళనకరంగా తయారవ్ఞతున్నది. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభించిం ది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రెండువేల మందికి ఈ వ్యాధిసోకగా నలభైఐదు మంది మృత్యువాతపడ్డారు. ఇవి అధికార లెక్కలు మా త్రమే. అనధికారికంగా ఇందుకు పది పన్నెండు రెట్లు ఎక్కువగా ఉండవచ్చునని డాక్టర్లే అభిప్రాయపడుతు న్నారు. వరంగల్‌జిల్లా వర్ధన్నపేటలో అసిస్టెంట్‌పోలీసు కమిషనర్‌ స్వైన్‌ఫ్లూ బారినపడి ఆదివారం మరణించా రు. ఆయన జ్వరం రావడంతో జరిపిన పరీక్షల్లో స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కన్పించడంతో వరంగల్‌లో చికిత్స అం దించి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ వైద్య శాలకు తరలించారు.

అత్యాధునిక పరికరాలు, మందు లు,అత్యంత నిపుణులైన డాక్టర్లు చికిత్స అందించి ఆయ నను ఆ వ్యాధి బారి నుండి రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ స్వైన్‌ఫ్లూ వ్యాధి ఏనాటి నుంచో ఉన్నా దీనిని నివారించేందుకు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొంత మేరకు ఫలితాలు సాధించారనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు స్వైన్‌ఫ్లూకు కారణమైన హెచ్‌-1, ఎ-1 వైరస్‌ తన రూపం మార్చుకున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఇప్పటి వరకు వాడుతున్న మందులు అంతగా పనిచేయడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవ్ఞతున్నాయి. అంతే కాదు డెంగ్యూ, చికెన్‌ గున్యా,మలేరియా వంటి వ్యాధులు సోకడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విల విలలాడుతున్నారు.తగ్గుముఖం పట్టిందనుకున్న మలే రియా కూడా తిరిగి విజృంభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడువందల నలభైకోట్ల మందికి మలేరియా సోకే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.2015లో భారతదేశంలో దాదాపు కోటిముప్ఫై లక్షలమందికి ఈ వ్యాధి సోకగా ఇరవైనాలు గువేల మందికిపైగా మరణించారు. అలాగే డెంగ్యూ వ్యాధి కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో విస్తరిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. అసలు ఏ రోగానికి ఎంత మంది బలైపోతున్నారో తెలి యని అయోమయపరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతం ఉంది.

విషజ్వరాలు అంటున్నారేతప్ప మన్యంమరణాలకు స్పష్ట మైన కారణాలు చెప్పలేకపోతున్నారు. ఆ మరణాల్లో ఎంత మంది డెంగ్యూ, మరెంత మందికి స్వైన్‌ఫ్లూ, ఇంకెందరు చికెన్‌గున్యా బారిన పడి అసువ్ఞలు బాసారో ఆ ప్రాంతం డాక్టర్లకే తెలియడం లేదు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో మందులు ఉంటే డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉంటే మందులు ఉండవ్ఞ. డాక్టర్లను, కిందిస్థాయి వైద్య సిబ్బందిని పెద్దఎత్తున నియమిస్తున్నామని ప్రకటనలే తప్ప ఆచరణ రూపం దాల్చడం లేదు. వైద్యరంగంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.గిరిపుత్రులు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక నాటు వైద్యులపై ఆధారప డుతున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రాణాల మీదకు వస్తు న్నాయి.

ఈ డెంగ్యూ వ్యాధి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.ఎన్నో ఏళ్లనుంచి ఉన్నదే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈ వ్యాధిని గుర్తించారు. 1997లో మొదటి కేసు నమోదు అయింది. ఆ తర్వా త అప్పుడప్పుడు ఈ వ్యాధి బారిన ఎంతో మంది పడు తూనే ఉన్నారు. ఇదిరానురాను పెరుగుతుండడం ఆందో ళన కలిగించే అంశం. ఈవ్యాధులు వీటితోపాటు అంటు రోగాలు సోకడానికి ప్రధానంగా పరిశుభ్రత లోపమేన నేది అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా డెభ్భైశాతం డెంగ్యూ రోగుల్లో పిల్లలే ఉన్నారు.

అటు మలేరియా, ఇటు స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి వ్యాధులు ప్రజారోగ్యంపై చేస్తున్న దాడిని విజయవంతంగా ఎదు ర్కొనడంలో పాలకవర్గాలు విఫలమవ్ఞతున్నాయని చెప్ప కతప్పదు.శతాబ్దాలుగా మానవాళిని పట్టిపీడిస్తున్న మలే రియాను నియంత్రించడంలో బల్గేరియా, హంగీ, తైవా న్‌ లాంటి దేశాలు విజయం సాధించాయని చెప్పొచ్చు. మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రో గాలకు మూలకారణమైన దోమల నివారణలో పటిష్ట మైన ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. వైద్యఆరోగ్య వ్యవస్థ రకరకాల సమస్యలతో కుప్పకూలి పోతున్నది.దోమల నివారణకు కొన్ని దశాబ్దాలుగా డిడిటి ని ఉపయోగిస్తూ వచ్చారు.

అయితే రానురాను దోమ ల్లో నిరోధకశక్తి పెరిగిపోవడంతో డిడిటి పనిచేయకుండా పోయింది. డిడిటి వాడుతున్నా దోమలుఅలాగే విజృం భించడంతో చేసిన పరిశోధనల్లో ఈ డిడిటి పనిచేయడం లేదనే విషయం బయటపడింది. దానిస్థానంలో మలాథి యాన్‌ను ప్రవేశపెట్టారు. అది కూడా నాలుగైదేళ్లు బాగా పనిచేసినా ఆ తర్వాత నుంచి నిష్ప్రయోజనంగా మా రింది. ప్రధానంగా పొరుగునున్న చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తదితర సరిహద్దు రాష్ట్రాల నుండి వలస వస్తున్న దోమ ల్లో నిరోధకశక్తి బాగా ఎక్కువగా ఉన్నట్లు మనదగ్గర ఉన్న మందులతో వాటిని నిర్మూలించలేకపోతున్నట్లు బయటపడింది. ఇకనైనా సమీక్షలు, సమావేశాలు ప్రకట నలతో కాలం గడపకుండా దోమల నివారణకు నిర్దిష్ట మైన చర్యలు చేపట్టాల్సిన సమయమిది.

– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌