దొర‌కు బానిస‌త్వం చేసేందుకే క‌డియంకు ప‌ద‌వి

Manda Krishna
Manda Krishna

సూర్యాపేట: తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై, ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మందకృష్ణ మాదిగా తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీవర్గీకరణ విషయంలో కడియం శ్రీహరి వ్యవహారం చూసి సిగ్గుతో తలదించుకుంటున్నా అని అన్నారు. గురువారం సుర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దొర(కేసీఆర్)కు బానిసత్వం చేసేందుకే కడియంకు డిప్యూటీ సీఎం పదవి ఉపయోగపడుతోందని ఎద్దేవా చేశారు. భారతి మృతిపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారతి ఆశయ సాధన కోసం ఈనెల 19వరకు నిరసనలు, 20వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.