దైవానికి కృతజ్ఞతలు తెలపాలి

MASJID
MASJID

 దైవానికి కృతజ్ఞతలు తెలపాలి

దాసుల అవసరాలను తీర్చటం కేవలం అల్లాహ్‌ విధి. అంతేకాని దాసులది కాదు. అవసరాన్ని కల్పించటం అతడే చేస్తాడు, దాన్ని నెరవేర్చడం కూడా ఆయనే చేస్తాడు. ఈ మధ్యలో దాసునికి పరీక్ష ఉంటుంది. మానవ సమాజంలోని ప్రతి వ్యక్తిలోనూ కృతజ్ఞతాభావం తప్పనిసరిగా ఉండవలసిందే. కాని అంతకంతకూ చెడిపోతున్న నేటి సమాజంలో కనీసం ధర్మసంస్థాపన కొరకు నడుం కట్టిన వారిలో ఈ దీపిక అనునిత్యం ఆలోచిస్తాడు: ‘అల్లాహ్‌ నా ఎడల ఎన్ని ఉపకారాలు చేశాడు.

నేను ఈ లోకంలోకి రాకముందు మాతృగర్భంలో నా పోషణకు ఎంతో విచిత్రంగా ఎన్నో ఏర్పాట్ల చేశాడు. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత శైశవంలో కాళ్లూ చేతులు ఆడని కాలంలో అపురూపంగా చేసుకునే ప్రేమమయిన, మాతృమూర్తిని నా పోషణ, రక్షణలకు నియమించాడు. క్రమక్రమంగా మాట్లాడడానికి, కాళ్లూచేతులు ఆడించడానికి శక్తిసామర్థ్యాల నిచ్చాడు. నేను ఎవరికీ ఏమీ కానికాలం నుండి పుట్టి, పెరిగి, గిట్టేవరకు ఈ భూమ్యాకాశాల కార్ఖానా అంతటినీ నాకోసమే అన్నట్లు నిరంతరం నడిపించాడు. నా శారీరక, మానసిక, వైజ్ఞానిక అవసరాలకు వనరులు పుట్టించాడు ‘అంటూ దైవం చేసిన ఒక్కొక్క ఉపకారాన్ని, అనుగ్రహించిన ఒక్కొక్క వరప్రసాదాన్ని మననం చేసుకుంటూ, ఒకవైపు ఎనలేని తన బలహీనతల్ని, మరోవైపు అంతులేని ఆయన అనుగ్రహాల్ని చూసుకుంటాడు.

అతని ఆంతర్యంలో తన ఉపకారి, దాత ఎడల ప్రేమభావం మేలుకుంటుంది. అతని నోరు ఆ ప్రభువ్ఞ గొప్పతనాన్ని గానం చేస్తుంది. శరీరంలోని సమస్త అవయవాలు, సర్వశక్తులు ఆ స్వామిని ప్రసన్నం చేయడానికి, ఆ మార్గంలో పరుగులు తీయడానికి అంకితమయిపోతాయి. ఈ భావననే ‘దైవం పట్ల కృతజ్ఞతాభావం అంటాం. ఇది సర్వసత్కార్యాలకు ఊపిరి లాంటిది. ఈ భావాన్ని మేల్కొలపడానికీ, పెంపొందించడానికీ దైవగ్రంధాలు అవతరించాయి. దైవప్రవక్తలు ప్రభవించారు.

ఈ భావాల్ని మనిషి మనసు నుండి రూపుమాపడమే షైతాన్‌, ఇబ్లీస్‌ అసలు కార్యక్రమం. ఈ భావం ఎంత సజీవంగా ఉంటే అంతగా మనిషి దైవవిధేయతా చరణంలో ముందుంటాడు. ఈ భావం మనిషిలో అణగారిపోయినపుడే మనిషి పాపం వైపునకు, అపరాధల వైపునకు అడుగిడగలుగుతాడు. కృతజ్ఞతాభావం మనిషిలో జాగృతమయినపుడు అతని జీవితం దైవదాస్యమార్గంలో ఉజ్వలమానమవ్ఞతుంది. మనిషి ఆంతర్యంలో పరలోక చింతన స్థానమేర్పరుచుకున్నపుడు, అతనికి దైవనామస్మరణే దినచర్యగా మారుతుంది. పడుకునేటప్పుడు, మే నామమే తనకు తోడూ నీడ కావాలని కోరుకుంటాడు.

– షేఖ్‌ అబ్దుల్‌హఖ్‌