దేశ వ్యాప్తంగా 800 ఇంజ‌నీరింగ్ కాలేజీల మూసివేత‌!

aicte
aicte

ఢిల్లీ: కాలేజీలో మౌలిక వసతులను కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడం,
అశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం తదితర కారణాల వల్ల వచ్చే విద్యా సంవత్సరం
నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసి వేసున్నట్లు అల్‌ ఇండియా
కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఎఐసిటిఇ) చైర్మెన్‌ అనిల్‌ దత్తాత్రేయ తెలిపారు. ఇప్పటికే
ప్రతి ఏటా ఏడాది 150కాలేజీలు స్వచ్ఛందంగా మూతపడుతున్నాయని, చాలా కాలేజీల్లో
30శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.