దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు

Bjp1

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముందంజలో ఉన్నట్లుగా ఆరంభ ట్రెండ్స్ లోనే తేలిపోవడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయాయి. అహ్మదాబాద్ లో బీజేపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు నృత్యాలు చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.