దేశ రక్షణకు అణుశక్తి అవసరం

nuclear power plant
nuclear power plant

 దేశ రక్షణకు అణుశక్తి అవసరం

దేశరక్షణకు అణుశక్తి చాలాఅవసరం.అప్పుడే పొరుగు నున్న శత్రుదేశాల దురాక్రమణ చర్యలను నిర్మూ లించగలం. అందుకనే శక్తివంతమైన అణుబాంబుల ను పరీక్షించడం మనదేశంలో దాదాపు 20 ఏళ్ల క్రితమే ప్రారం భమయింది. అణ్వస్త్రాన్ని తయారు చేయాలా వద్దా అన్న సంశం యం 1969ప్రాంతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి కలిగింది. ‘వాదనా పటిమ వాదించిన వ్యక్తి బలం విూద ఆధారపడి ఉం టుంది. అదే బలహీనుడి మాటలు అర్థం లేని ప్రేలాపనలుగా అపహాస్యం కావడమేకాక, అవతలి వారిని చిర్రెత్తిస్తాయి అని ఆనాటి ప్రధాన కార్యదర్శి పిఎన్‌ హస్కర్‌ చెప్పినమాట ఇందిరకు ప్రోత్సాహకర దిశలైపు ప్రేరణ కలిగించింది. ఆ తరువాత ఇందిర ఇక తిరిగి వెనుక చూడలేదు. అణుబాంబుల తయారీకి 1974లో అనుమతించారు. అప్పటి నుంచి అణుపరీక్షలు కొనసాగాయి.
నిజానికి అణుబాంబులు, క్షిపణులు, యుద్ధవిమానాలు, జలాం తర్గాములు, యుద్ధనౌకలు మొదలగునవి మనదేశానికి అత్యంత అవసరం. యుద్ధం మరీ అవసరమైనప్పుడు ఇక తప్పదు అని దృఢ నిర్ణయం తీసుకొన్నప్పుడు మాత్రమేచేయాలి. అయితే ఆయు ధాలు మాత్రం అన్ని వేళలా అనివార్యంగా ఉండాలి. ఈ విషయా నికి సంబంధించి మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘ఆయు ధం లేనివారిని ఎవరూ గౌరవించరు,చివరికి బంధుమిత్రులు కూడా పట్టించుకోరు. అలాగే బలం లేనివాడి మాటని ఎవరూ వినరు. అందుకే ముందు నీవ్ఞ ఆయుధం ధరించి, నీ అంబులపొదిలో ఆయుధాలు ఉండనివ్ఞ్వ అని హితబోధ చేశాడు.

ఇక ఆ తరువాత అర్జునుడు విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ అణు ఆయుధాల గూర్చి క్షిపణులు సమకూర్చుకోవడం సంబం ధించి మన దేశ మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త డాIIఎ.పి.జె అబ్దుల్‌ కలామ్‌ కూడా ఎంతో ప్రోత్సహించారు. ఆయన అలా పదేపదే అనేకసార్లు అనడంలో ఎంతోనిజముంది.ఎందుకో ఒకసారి ప్రముఖుల మాటలనుగమనిస్తే మనకు స్పష్టంగా అర్థంఅవ్ఞతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాకిస్థాన్‌ గూర్చి ఏమన్నారంటే ‘పాకిస్థాన్‌ టెర్రరిస్టులకి ఒక లేబొరేటరీగా ఉంటూ, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుండడంతో పాకిస్థాన్‌లోని టెర్రిరిస్టుల వలన ఒక్క భారతదేశానికే కాదు ఇతర ప్రపంచదేశాలకీ ముప్పు ఉంది అని ఆయన అనేకసార్లు అన్నారు. అలాగే ‘భారతదేశం వలన పాకిస్థాన్‌ భయపడాల్సింది ఏమీలేదు. భారత్‌ గొప్ప ప్రజాస్వామిక దేశం. అనవసరంగా భారత్‌ వలన మాకు ప్రమాదం ఉంది అని పాకిస్థాన్‌ ఆరోపించడంలోఅర్థంలేదు అన్నారు. అలాగే చైనా విషయా నికి వస్తే 2002 నుంచి 2003 వరకు అనేకసార్లు అప్పటి మన దేశ రక్షణశాఖ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్‌ భారతదేశా నికి పాకిస్థాన్‌ కన్నా చైనా నుండి అధిక ప్రమాదం ఉంది అని అన్నారు.

ఇక 2009లో మనదేశ ఐ.ఎ.ఎఫ్‌ (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) మార్షల్‌ ఫాలీ హోమీ మేజర్‌ ఏమన్నారో గమనించండి. ‘యుద్ధతంత్రంలో చైనా శక్తి సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలు, అలా గే యుద్ధ విన్యాసాల గురించి మనకి పెద్దగా తెలియదు. అందు వల్ల భారతదేశ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ కన్నా చైనాతోనే మన దేశానికి అధిక ముప్పు పొంచి ఉంది అని అన్నారు. చైనా-భారత్‌ మధ్య సమస్యలు 3,380 కిలోమీటర్ల మేర భారత్‌-చైనా సరిహద్దు ఒక చిక్కు సమస్యగా ఉంది.దీనిలో2800కిలోమీటర్లు వివాదాస్పద సరిహద్దు గా చెప్పవచ్చు. మన భారతదేశం ఏనాడూ సరిహద్దు దాటి దుశ్చ ర్యలకు పాల్పడలేదు. అదే చైనా మాత్రం 1959లో మొదటిసారి లాంగ్‌ జూ (అరుణాచల్‌ప్రదేశ్‌) జౌట్‌పోస్టుపై మెక్‌ మోహన్‌ రేఖ అవ్ఞతల నుండి కాల్పులు జరిపింది. ఇక ఆ తరువాత జమ్మూకాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలోకి కొంత చొచ్చుకొని వచ్చారు. మన ఆర్మీ ప్రతిఘటించడంతో వెను తిరిగారు.

ఇక 1959 అక్టోబరులో ఆక్సా§్‌ుచిన్‌ ప్రాంతంపై చైనా ఆర్మీ ఆకస్మికంగా దాడికి పాల్పడిం ది. ఊహించని ఈ పరిణామానికి అక్కడి సి.ఆర్‌.పి.ఎఫ్‌ దళాలు షాక్‌ అనిపించినా ఎంతో విరోచితంగా పోరాడి సుమారు పన్నెండు మంది అసువ్ఞల్ని బాసారు. ఆ సమయంలో భారత ఆర్మీఅక్కడ లేదు.ఆర్మీ వచ్చేలోపు సి. ఆర్‌.పి.ఎఫ్‌ జవాన్లు దేశరక్షణ కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం.అందుకే ప్రతియేటా భారతదేశంలో అక్టోబరు 22ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.

ఈ అమర వీరుల గుర్తుకు చిహ్నంగా ఒక స్థూపాన్ని నెలకొల్పారు. (రేపటి మీ కోసం, నేటి మా ఆత్మార్పణం) నిజమే కదా పోలీసు వారి సేవలు నిరంతరం మరువలేనివి. దేశంలో శాంతిభద్రతలను కాపాడే మార్గంలో సుమారు ప్రతియేటా 400మంది పోలీసులకి పైగానే ప్రాణాలుకోల్పోతున్నారు.సుమారు 200మంది గాయాలపాలవ్ఞతు న్నారు. మరికొందరు అంగవికలు రుగా మిగులుతున్నారు.ఇక చైనావిషయానికి వస్తే 20-10-1962 లో పూర్తిస్థాయిలో మనదేశంపైకి యుద్ధానికి దిగింది. అయితే భారత సైన్యం తీవ్రస్థాయిలోనే ప్రతి ఘటించి పోరాడింది. పర్యవ సానంగా చైనానే 20-11-1962లో యుద్ధ విరమణ ప్రకటించిం ది.

ఇక మొత్తంగా చైనా 1965 నాటి కి మనదేశంలో 36,846 చ.కి.మీ ప్రాంతాన్ని ఆక్రమించింది. అంటే హైదరాబాద్‌ (6,852 చ.కి.మీ), బెంగళూరు (8,000 చ.కి.మీ) చెన్నై (1,167చ.కి.మీ) కలకత్తా (1,425 చ.కి.మీ) ఢిల్లీ (1,483 చ.కి.మీ) నగరాల మొత్తం 23,199 చ.కి.మీ విస్తీర్ణం కంటే అధికం. అయితే చైనా ఆక్రమణకు గురి అయిన ప్రాంతం వ్యవసాయానికి పనికి వచ్చేది ఏమీకాదు. అయినా నష్టం నష్టమేకదా. ఇక చైనా ఈ దురాక్రమణ చాలదు అన్నట్లు 1986 నుండి అరుణాచల్‌ రాష్ట్రం (90వేల చ.కి.మీ) మొత్తం మాదే అని వాదిస్తుంది. పైగా రాంగ్‌చో అనే ప్రాంతంలో రెండుదేశాల సైన్యాలు ముఖాముఖి తలపడ్డాయి. ఒక దశలో యుద్ధం వచ్చేటంత పనైంది. ఇక 2003 జూన్‌ నెలలో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పా§్‌ు చైనా పర్యటనలో ఉండగానే అరుణాచల్‌ప్రదేశ్‌లోని అసాఫిలా ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు.

ఇక మరోపక్క చైనా ఒక దశలో సిక్కిం రాష్ట్రం కూడా భారత్‌లో అంతర్భాగం కాదు అని వాదించింది. అయితే 2003లో మనభారతదేశం వ్యూహాత్మ కంగా వ్యవహరించి టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని చెప్పడంతో చైనా కూడా సిక్కిం భారత్‌లో భాగమే అని ప్రకటిం చింది. ఇక 2007లో ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ఇండియాటుడేకి అందిన రహస్య నివేదిక ప్రకారం చైనా దళాలు సుమారు 130 దాడులకు పాల్పడ్డాయిఅని తెలిపింది.ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని (తవాంగ్‌,అసాఫిలా, లాంగ్‌జు)అలాగే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని జోషిమఠ్‌ ప్రాంతంలో అధికంగా చైనా దాడులకు పాల్పడింది అని ఆపత్రిక తెలిపింది. ఈ సంఘటనని గమనించే రక్షణ రంగ వ్యూహ విశ్లేషకుడు బ్రహ్మచెలా ్లని 2007లో ‘భారత దేశాన్ని ఎప్పుడూ ఆందోళనలో ఉంచాలనే వ్యూహాత్మక లక్ష్యంతో చైనా పావ్ఞలు కదుపుతోంది అని అన్నారు.

2010 నవంబర్‌లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ చైనా ప్రధాని వెన్‌ జియా బావోల సమావేశానికి రెండురోజుల ముందు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మా జావోక్స్‌ ఒక ప్రకటనలో ఏమన్నారంటే.. భారత ఆక్రమిత కాశ్మీర్‌ వాసులకు సంబంధించి చైనా వీసా విధానం మొదటినుంచి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.అది మారదుకూడా. ఇలా కరాఖం డిగా చెప్పడం జరిగింది. 2008 లో ఎప్పుడైతే భారత్‌ అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదిరిందో అప్పటి నుండి కాశ్మీర్‌, అరుణా చల్‌ప్రదేశ్‌, లడఖ్‌ప్రాంతాల విషయంలో చైనా విధానంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 1962 అక్టోబర్‌లో భారత్‌ చైనా మధ్య యుద్ధం జరిగాక 1963మార్చి నెలలో అప్పటిపాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ ఆయూబ్‌ఖాన్‌ భారత్‌ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో చైనాకు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని షాకిగం లోయలో గల దాదాపు ఐదు వేల చ.కి.మీ భూభాగాన్ని చైనా వశంచేయడం జరిగింది.

దీనిఫలి తంగా అరేబియన్‌ సముద్రా నికి పశ్చిమాసియాకు మార్గం చైనాకు సుగమమైంది. కీలక రంగా లలోనేకాక వాణిజ్యరంగాలలో కూడా ఈ ప్రాంతం చైనాకు అత్యం త ముఖ్యమైనది కావటం గమనార్హం. ఇక ఇప్పుడు చైనా తనకు దగ్గరి ప్రాంతమయిన లడఖ్‌పై దృష్టి సారించడం మనలను ఆందోళనకు గురిచేస్తోంది.జలవిద్యుత్‌ పరం గా బ్రహ్మపుత్ర నదిపై 2040 నాటికి ప్రస్తుతం ఉన్నదానికి అద నంగా నలభైవేల మెగావాట్ల విద్యత్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వివిధ ప్రణాళికలతో చైనా ముందుకు కదులుతుంది.

మనం మాత్రం స్వదేశంలోనే రాష్ట్రాల మధ్య సయోధ్యలేక విద్యుత్‌ ఉత్పత్తిలో వెనుకబడిపోతుండటం విచారకరం. ప్లుటోనియంతో భారీ విద్యుత్‌ ఉత్పత్తి ఈ ప్లుటోనియం విషయంలో ఒక్క గ్రాము ప్లుటోనియం కూడా అత్యంత విలువైనది. కేవలం ఒక్క కిలోగ్రాము ప్లుటోనియంతో 10 మిలియనయూనిట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు.అయితే ఇతర ఇంధన వనరులని పోల్చి చూసినప్పుడే దీని సామర్థ్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎఫ్‌.బి. ఆర్‌ అణురియాక్టర్‌ల ద్వారా ఈ ప్లుటోనియంని వినియోగించి పెద్ద మొత్తంలో విద్యుత్‌ ఉత్పత్తికి మనం స్వీకారం చుట్టాం.

ఈ ప్లుటోనియం ఎంతోవిలువైనది కాబట్టే బంగారం,వజ్రాలకన్నా మనదేశానికి దీని అవసరం వెల కట్టలేనిది. ఎందుకంటే మన భారతదేశ శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పర్చుతున్న ఎఫ్‌.బి.ఆర్‌ (ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌) ద్వారా ఈ ప్లుటోనియంని వినియోగించి ఒకపక్క భారీస్థాయిలో విద్యుత్‌ఉత్పత్తి చేస్తూనే మరోపక్క అధికమొత్తంలో ప్లుటోనియంని లేదా యురేనియం- 233ని పొందగలం.ఇలా పెద్ద మొత్తంలో ఎఫ్‌.బి.ఆర్‌ ప్లుటోని యంని మనదేశంలో అపారంగా లభిస్తున్న థోరియం-232 అనే ఐసోటోప్‌ని యురేనియం -233 అనే అణు ఇంధనంగా భారీస్థాయిలో ఫాస్ట్‌ బ్రీడర్‌రియాక్టర్‌ ద్వారా తయారు చేసి 2032 సంవత్సరం నాటికి ఇంధన స్వాతంత్య్రం పొందాల నేదే మనభారతదేశం ప్రధాన లక్ష్యం.

అయితే దేశ భవిష్యత్తు దృష్ట్యా అంటే భావి తరాలకి శిలాజ ఇంధన వనరులని పారిశ్రామిక అవసరాలకి అందిస్తూ కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పిస్తూ విద్యుత్‌కొరత లేకుండా చేయాలం టే ఈ అణుఒప్పందం మనదేశానికి అత్యంత కీలకమైంది. మన దేశం ఇంధన స్వాతంత్య్రం పొందాలంటేతప్పకుండా యురే నియం అవసరం ఉంది. ఈ యురే నియం ద్వారానే ప్లుటోనియంని పొందుతున్నాం. మనదేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉండటం, నాణ్యత కూడా తక్కువగా ఉండటం మూలంగా విదేశాల నుండి యురేనియంని దిగుమతి చేసుకోకతప్పదు. మరి ఇలా జరగాలంటే భారత్‌ అమెరికా అణుఒప్పందం ఒక ఉన్నత మైన మార్గంగా మనం చెప్పవచ్చు.

– కనుకుల యాదగిరి రెడ్డి