దేశ జిడిపి తగ్గుతుంది: రాజన్‌

Raghuram Rajan
Raghuram Rajan

దేశ జిడిపి తగ్గుతుంది: రాజన్‌

న్యూఢిల్లీ,సెప్టెంబరు 8: కేంద్ర ప్రభుత్వం తీసుకుం టున్న నిర్ణయాలు భారత వృద్ది రేటును నిధానం చేసేలా ఉన్నాయని, ఒకవైపు ప్రపంచ వృద్ధిరేటు గణనీయంగా పుంజుకుంటుంటే మన దేశ జిడిపి మాత్రం తగ్గుతుందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ హెచ్చరించారు. నోట్ల రద్దుతో పాటు, జిఎస్‌టి కూడా వృద్ధిని తగ్గించాయని ఆయనపేర్కొన్నారు. అంతేకాకుండా తన మూడు సంవత్సరాల పదవీ కాలంలో యుపిఎ ప్రభు త్వం ఏనాడు తనపై పరిమితులు,ఆంక్షలు విధిం చలేదని వ్యాఖ్యానించిన రాజన్‌ ప్రభుత్వం మారిన తరువాత ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగేం దుకు తాను ఆసక్తిని చూపినప్పటికి ఎన్‌డిఎ ప్రభుత్వం ఆఅవకాశం ఇవ్వలేదన్నారు.నోట్ల రద్దు బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకునేందుకు సహ కరించిందని, అందువల్లే 99శాతం కరెన్సీ వెనక్కి వచ్చిందన్నారు. నోట్లరద్దు వల్ల జరిగిన ఖచ్చిత మైన నష్టం ఎంతన్నది ఎవరూ చెప్పలేరని, అయితే ఆ నష్టం ఏంటన్నది త్వరలోనే బ్యాంకర్లకు తెలుస్తుందని రాజన్‌ పేర్కొన్నారు.