దేశీయ మార్కెట్లోకి

RENAULT
RENAULT CAPTUR

దేశీయ మార్కెట్లోకి 

న్యూఢిల్లీ, అక్టోబరు 11: భారత్‌లో శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఆటోమోబైల్‌ బ్రాండ్లలో ఒకటైన రెనాల్ట్‌ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన తన ప్రీమియం ఎస్‌వియు బ్రాండ్‌ రెనాల్ట్‌ క్యాప్చర్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. చెన్నై సమీపంలోని రెనాల్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో తయార వుతున్న ఈ వాహనాన్ని పండగల సీజన్‌ సందర్భంగా మార్కె ట్లో విడుదల చేయడానికి సంస్థ సిద్ధమవుతోంది. దీనికి సన్నా హాత్వంగా గత నెల 22 నుండి కేవలం రూ.25వేల ప్రాధా మిక బుకింగ్‌ డిపాజిట్‌తో రెనాల్ట్‌ క్యాప్చర్‌, రెనాల్ట్‌ ఇండియా వెజ్‌సైట్లపై ముందస్తు బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. గత ఐదు సంవత్సరాలుగా రెనాల్ట్‌ భారత్‌లో తన ఉనికిని పెంచుకోవడానికిఅనేకచర్యలు తీసుకుంటుంది. రెనాల్ట్‌క్యాప్చర్‌ ను ప్రవేశపెట్టడం అందులో ఓ ప్రధానమైన చర్య. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ వాహనం శక్తివంతమైన ఇంజిన్‌, పలు సెప్టీ ఫీచర్స్‌తో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌, రంగుల్లో లభ్యమవుతుంది. దీనికి తోడు శక్తివంతమైన లైటింగ్‌, ఇంటిరియర్‌, ఎస్టీరియర్‌ ఫిచర్స్‌ను కూడా కల్గిఉంటుంది. ఈవాహనం ఎస్‌యువి విభాగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా భారతీయ రోడ్లపై తిరుగులేని స్థానాన్ని సంపాదిస్తుందని తమకు గట్టినమ్మకం ఉంద ని రెనాల్ట్‌ ఇండియా సిఇఒ ఆపరేషన్స్‌ విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ సాహ్నీ ఈసందర్భంగా అన్నారు.