దేశీయ మార్కెట్లు లాభాల్లో…

stock market
stock market

ముంబైః బుధవారం నాటి సెషన్లో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగబాకింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 139 పాయింట్ల లాభంతో 33,136 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 31 పాయింట్లు లాభపడి 10,155 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఎన్టీపీసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు లాభపడగా.. టాటాస్టీల్‌, బోష్‌ లిమిటెడ్‌, హీరోమోటార్స్‌, ఐషర్‌మోటార్స్‌, అదానీపోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.