దేశాన్ని కాపాండేందుకు విపక్షాలు ఏకంకండి

stalin
stalin

కోల్‌కత్తా: ప్రధాని మోదిని ఇంటికి పంపించే తరుణం దగ్గర్లోనే ఉందని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ అన్నారు. ర్యాలీలో పాల్గొన్న స్టాలిన్‌ మాట్లాడుతూ..వచ్చే ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటానికి అద్దం పడతాయని అన్నారు. బిజెపిని ఓడించండి, మోదిని గద్దె దించండి, దేశాన్ని కాపాడండి ఇదే మన నినాదం. వెమోదికి వ్యతిరేకంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారని చాలా మంది తనను ప్రశ్నించారని, దానికి సమాధానంగా తాను మోది విధ్వంసకర విధానాలకు మాత్రమే నేను వ్యతిరేకం అని అన్నారు. అంతేకాని వ్యక్తిగతండా ఎటువంటి వ్యతిరేకం లేదని బదులు చెప్పాను అని అన్నారు. దేశాన్ని కాపాడేందుకు విపక్షాలంగా ఏకమవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్టాలిన్‌ తమిళంలో ప్రసంగం చేస్తుండగా మరోకరు ఆయన మాట్లాడిన దాన్ని బెంగాలీలోకి తర్జుమా చేశారు.