దేశానికి విజ్ఞాన రాజధానిగా అమరావతి

IMG-
Lightning

దేశానికి విజ్ఞాన రాజధానిగా అమరావతి

ప్రపంచస్థాయిలో ఎపి రాజధాని నుంచే ప్రారంభం
పాఠశాల విద్య ప్రత్యేక చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌  దాస్‌ ప్రణాళిక

అమరావతిµ : ఇండియాస్‌ ఎమర్జింగ్‌ నాలెడ్జ్‌ క్యాపిటల్‌గా అమరావతిని తీర్చిదిద్ది ప్రపంచస్థాయిలో ఏపి రాజధానినుంచే విద్యను అందించడానికి పాఠశాల విద్యాప్రత్యేక చీప్‌ సెక్రటరీ ఎం. ఆదిత్యనాధ్‌దాస్‌ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయస్థాయిలో జరిగిన వర్క్‌షాపులో ఆయన పాల్గొని అమరావతి కేంద్రంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థుల్లో ఉన్న మేధ స్సును వెలికితీసి వారిఇష్టానుసారంగా వారిపై ఒత్తిడి తీసుకొనిరాకుండా మేధస్సుకుపదునుపెట్టి పోటీతత్వాన్ని పెంపొందించనున్నారు.

పోటీ ప్రపంచంలో పోటిని ఎదుర్కొవ డానికి నాలెడ్జ్‌ ఏకోసిస్టమ్‌ను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారి బోధనా నైపుణ్యంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలనుఅధిరోహించడానికి భావితరాలకు బాటలువేసే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శాలకు విద్యాభివృధ్ధికి అనుగుణంగా ప్రపంచస్థాయిలో చెందుతున్న మార్పులను అధికమించే విధంగా ప్రపంచస్థాయి రాజధానిగా ఏపిని తీర్చిదిద్దడానికి నాలెడ్జ్‌ క్యాపిటల్‌ను ఏర్పాటుచేస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే విద్య వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొనివచ్చి ప్రపంచస్థాయిలో విద్యాబోధనలను, నూతన సంస్కరణపై అధ్యాయనం చేయడంతోపాటు రాష్ట్రంలో విద్యాబోధన సౌకర్యాలపై భారీ మార్పులు తీసుకొని వచ్చారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి రంగంలో విద్యారంగం కీలకపాత్ర వహించే విధంగా ప్రాధమిక విద్యనుంచి విశ్వవిద్యాలయం, వృత్తికోర్సుల ఆధారంగా అమరావతిని విజ్ఞానసిటిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ అభిమతం మేరకు అనేక చర్యలు చేపట్టారు.

విద్యతోపాటు విద్యార్థులకు ఆసక్తికరమైన రంగాల్లో నైపుణ్యాభివృధ్ధిని వారిలో పెంపొందించ డానికి అమరావతిలో నాలెడ్జ్‌ సిటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ నాలెడ్జ్‌ సిటిలో సీఆర్డీఎ ఆధ్వర్యంలో 8,547 ఎకరాలను అమరావతిలో విజ్ఞాననగరానికి కేటాయించి 1.73లక్షల మందికి ఉపాధి కల్పించడానికి సీఆర్డీఎ నోడల్‌ ఏజేన్సీగా బాధ్యతలు తీసుకొంటున్నారు.

ఏఐసీటిఈ సలహాదారు ప్రొ రాజీవ్‌ కుమార్‌, సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ సీఈవో వికాస్‌ శర్మ,రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ప్రత్యేకఅధికారి భావనాసక్సేనా తదితరులు సమన్వయంతో సీఆర్డీఎ నాలెడ్జ్‌ సిటికి రూపకల్పన జరుగుతోంది. అమరావతినగరం పరిశోధలనకు,విజ్ఞానానికి, శిక్షణలకు,అంకురాలకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. రాజధాని ప్రాంతంలో అభివృధ్ధికి విద్యలో మార్పులకు,నూతన సంస్కరణలకు ప్రపంచదేశాల్లో ఆదర్శంగా నాలెడ్జ్‌సిటిని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయడానికి కృషి చేయనున్నారు. ప్రభుత్వ మిషన్‌,విజన్‌ను అమలు చేసి తద్వారా విద్యాభివృధ్ధి,నైపుణ్యాభివృధ్ధికి దోహదపడడానికి విజ్ఞాననగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపకల్ప చేసి విజ్ఞాననగరం నుంచే విద్యాకార్యకలాపాలను నిర్వహించడానికి స్పెషల్‌ సీఎస్‌ ఆధిత్య నాథ్‌దాస్‌ నడుంబిగించారు.