దేశానికి దిశానిర్ధేశం చేసే సత్తా కేసిఆర్‌కే ఉంది

kcr, asaduddin owisi
kcr, asaduddin owisi

హైదరాబాద్‌: ఇవాళ కేంద్ర బడ్జెట్‌లో కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రకటించారు. దానికి ప్రతిస్పందించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వ్యవసాయ సమస్యలపై కేసిఆర్‌కు ఉన్న లోతైన అవగాహన మరే నేతకు లేవన్నది ఆయన ట్వీట్‌లో స్పష్టంగా అర్దమవుతుంది. తెలంగాణ చేపట్టిన పథకాలనే ప్రధాని అమలు చేస్తున్నారని, ప్రధాని మోదికి సొంత ఐడియాలు లేవని ఆయన అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు కేసిఆర్‌ లాంటి నేతలు అవసరమన్నారు. దేశానికి దిశా నిర్ధేశం చేసే సత్తా ఒక్క కేసిఆర్‌కే ఉందని, ఆయన చురుకుదనం, ముందుచూపు, అమోఘమైన జ్ఞానం దేశంలోని రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని అసద్‌ అన్నారు.