దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది

 

VENKAIH INNER
నెల్లూరు: దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారంనెల్లూరులో కోస్టల్‌ టూరిజం సర్య్కూట్‌ను ఎపి మ్‌ుఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అభివ్దృద్దికి అడ్డంకులు సృష్టించవద్దని అన్నారు. 50 నగరాల్లో వికలాంగుల కోసం కావల్సిన వసతుల కల్పనకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నాట్లు ఆయన చెప్పారు. స్వచ్ఛ నెల్లూరు, యాప్‌ను ప్రారంబించామని అన్నారు. విశాఖ నుంచి కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌కు ప్రాధాన్యత ఇస్తున్న పత్రికలకు ఆయన అభినందనలు తెలిపారు.