దేశం కోసం ఆడటాన్ని నేను గౌరవంగా భావిస్తాను

VIRAT KOHLI
VIRAT KOHLI

ముంబాయి: ఆదివారం భారత్‌-విండిస్‌ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ విజయానంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతు నేను క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడటానికి మరికొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలుంది. దేశం కోసం ఆడటాన్ని నేను గౌరవంగా, గర్వంగా భావిస్తాను.ఆటను తేలికగా తీసుకోను. నా వంతు మైదానంలో మెరుగైన ప్రదర్శన ఉండేలా జాగ్రత్త పడతాను. ఇక జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి నేను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈసందర్భంగా  కొన్ని సార్లు ఒత్తిడి ఎదురవుతుంది. దాన్ని అధిగమించి నా పని నేను చేసుకుంటూ పోవాలి. మనం ఎంత కష్టపడి ఆడతామో ఆ కష్టం.. విజయం, ప్రశంసల రూపంలో మనకు తిరిగి వస్తుందిగ అని అన్నాడు.