దేశంలో తీవ్ర నీటి కొరత

NITI Ayog
NITI Ayog

న్యూఢిల్లీ: దేశంలో తీవ్ర నీటి సమస్య ఉందని గుర్తించిన నీతిఆయోగ్‌ ఓ రిపోర్టు తయారు చేసింది. ఆ రిపోర్టు ఆధారంగా సుమారు 60 కోట్ల మంది నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపింది. 24 రాష్ట్రాల నుంచి సేకరించిన సర్వే ప్రకారం ఈ విషయాన్ని తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. 2020 కల్లా 21 నగరాల్లో నీరు అడుగంటి పోతుందని ఆ రిపోర్టులో తెలిపారు. వ్యవసాయానికి కూడా నీరే ప్రధానం కావడం వల్ల ఆ రంగం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని వెల్లడించారు.