దేశంలో కరోనా వ్యాప్తికి వారే కారణం

యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్

yogi aadityanath
yogi aadityanath

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లీగి జమాత్‌ కార్యకర్తలే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా బారిన పడడం నేరం కాదని, కాని వైరస్‌ సోకిన విషయం దాచి ఉంచడమే అసలైన నేరమని ఆయన అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠన చర్యలు ఉంటాయని, అన్నారు. ఈ తరహ నేరానికి తబ్లీగీ జమాత్‌తో సంబంధం ఉన్నవాళ్లు పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలో కరోనా వ్యాప్తి వెనక తబ్లీగీ పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా భారీగా పెరగడానికి, వివిధ రాష్ట్రాలో కేసుల సంఖ్య మరింత ఎక్కువ కావడం వెనక తబ్లీగీ జమాత్‌ ఉందని అన్నారు. ముందుగానే వారు కరోనా సోకిన విషయం దాచిపెట్టకుండా ఉంటే కరోనాను మరింత నివారించే వాళ్లం అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/