దేశంలో ఎంతో మందికి స‌చిన్ స్ఫూర్తిః ప్ర‌ధాని మోదీ

Modi, Sachin
Modi, Sachin

ముంబయి: ‘స్వచ్ఛతే సేవ’లో పాల్గొన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మంగళవారం ఉదయం పశ్రిమ బాంద్రాలోని  వీధులను సచిన్‌ చీపురు పట్టుకొని శుభ్రం చేశారు. ఒక్కరే పరిశుభ్ర భారత్‌ను చేయలేరని యువత, ప్రజలు కలిసి  రావాలని పిలుపునిచ్చారు. అందరూ తమ స్నేహితులతో కలిసి స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా  సచిన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.