దేవుళ్ళు సినిమా చేయాలనుకుంటే!

Lakshmii devi11
A still From Lakshmii deviki Ahwanam

దేవుళ్ళు సినిమా చేయాలనుకుంటే!

కష్ణ, జనని, అఖిల్‌, భార్గవి, చరణ్‌, ప్రజ్ఞ జంటలుగా కలర్స్‌ అండ్‌ క్లాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో జాకి అతిక్‌ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి. సోమవారం హైదరాబాద్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు పాటలను కూడా ప్రదర్శించారు. అనంతరం… సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ.. సోషియో ఫాంటసీ చిత్రంగా లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి చిత్రం రూపొందింది. దేవుళ్ళు సినిమా తీయాలనుకుంటే వారికి ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను ఈ చిత్రంలో చూపించారు. అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. జాకీ అద్భుతంగా దర్శకత్వం చేశారు.

సుబ్బారెడ్డిగారు సినిమాను రిచ్‌గా నిర్మించారు. నటుడు గౌతంరాజు కొడుకు కష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ప్యాడింగ్‌ స్టార్స్‌ అందరూ ఈ చిత్రంలోనటించారు. ట్రైలర్‌, పాటలు బావున్నాయి. ఏప్రిల్‌ 7న సినిమా రిలీజ్‌ అవుతుంది. ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో కష్ణ మాట్లాడుతూ.. సినీ ప్రముఖుల ఆశీర్వాదంతో సినిమా పూర్తయ్యింది. హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించాను. జాకీ సినిమాను ఎంటర్‌టైనింగ్‌ తెరకెక్కించారు. మాలాంటి కొత్తవారికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్‌.ఏప్రిల్‌ 7న విడుదలవుతున్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని భావిస్తున్నాను అన్నారు.