దేవునిపై భారంమోపి ఆపరేషన్‌ చేయించండి: వీణావాణి పేరెంట్స్‌

veena vaani

దేవునిపై భారంమోపి ఆపరేషన్‌ చేయించండి: వీణా-వాణి పేరెంట్స్‌

హైదరాబాద్‌:: తమ బిడ్డలు వీణా-వాణిలకు అపరేషన్‌ చేయించండి అంటూ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. ఆపరేషన్‌ చేస్తే ప్రాణహాని అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఇంకా వారిని ఆసుపత్రికి ఉంచుకోవటం కుదరదని నీలోఫర్‌ వర్గాలు వెల్లడించాయి.. దీంతో వారిని ఎక్కడ ఉంచాలన్న విషయంపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. వీణావాణిలను పోషించే శక్తి, వారికి వైద్యచికిత్సలు అందించే స్తోమత లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దేవుడిపై భారం మోపి ఆపరేషన్‌ చేయించాలని తెలంగాణ సర్కారుకు వీణావాణి తల్లిదండ్రులు విన్నవించుకున్నారు.