దేవీ నవరాత్ర వైభవం

DURGAMMA
DURGAMMA

దేవీ నవరాత్ర వైభవం

చరాచర సృష్టి అంతా ‘ ‘శక్తి ప్రధానంగా సాగుతుంది. కోటాను కోట్ల జీవరాశుల్లో ఉండే జీవ రూప ”శక్తి చైతన్యమే ఈ విశ్వం మనుగడకు ఆధారంగా నిలుస్తోంది. అనంత తేజోవ్యాపకమైన ఈ శక్తి భౌతిక రూపాన్ని ”ఆది పరాశక్తిగా విజ్ఞులైన మన ప్రాచీన ఋషులు దర్శనం చేశారు. ఈ పరాశక్తే దుర్గ, కాళి, భవాని, లక్ష్మి, సరస్వతి మొదలైన అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ ఉపాసనకు అత్యంత ప్రధానమైన కాలం ”శరన్నవరాత్రులు. ఈ నవరాత్రులే దసరా పండుగగా జన బాహుళ్యంలో ప్రసిద్ధి పొందాయి.

శరదిందు వికాస మందహాసాం, స్ఫురదిందీపర లోచనాభిరామాంI అరవింద సమాన సుందరాస్యాం, అరవిందాసన సుందరీముపాసేII శర దృతువులో కాచే పండువెన్నెల వంటి కాంతి, చల్లని చూపు, మంద హాసం, ముఖపద్మం కలిగిందిగా పరాశక్తిని ఋషులు భావన చేశారు. ”శరది ది భవా శారదా శరత్కాలంలో ఆవిర్భవించడం వల్ల ఆ దేవికి ”శారద అని పేరు వచ్చింది.

ఈ దేవిని ఉపాసన చేసే ప్రధాన కాలం శరన్నవ రాత్రులుగా ప్రసిద్ధి పొందాయి. ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కా లం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణా లను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోనుకాకుండా ఉండ డానికి జగదేకమాతను వేడుకుంటూ చేసే పూజా విధానమే శరన్నవరా త్ర వ్రతం. మరొక కోణంలో దసరా పండుగలుగా ఈ విధానం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. దశహారా అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి ”దసరా అయింది. హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ట దశమికి దశహరా అని పేరు. మరొక అర్ధంలో దశహరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగెట్టేది అనే అర్ధం కూడా ఉంది.

దుర్గాదేవి కూడా తన భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది. ఇక శబ్దార్ధపరంగా చూస్తూ ”ద అంటే దానవులను, ”సరా అంటే దూరం చేయునది- రాక్షసులను సంహరించి, ప్రజలకు సుఖశాంతులు అందించే దుర్గాదేవికి దసరా అని పేరు వచ్చింది. నవరాత్ర వైశిష్ట్యం… దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. అందుకనే వీటిని నవరాత్రులు అంటారు. ఇది సాధారణంగా విడుకలో ఉన్న అభిప్రాయం. నిజానికి నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు కాదు. ఇందుకు అనేక అర్ధభేధా లు ఉన్నాయి. రాత్రి అంటే తిధి అని అర్ధం ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్య మి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు. మరొక కోణంలో చూస్తే…రాత్రి శబ్దం ప్రాణ వాచకం. నవరాత్రులంటే తొమ్మిది ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్టితమై ఉండి, వాటిని కాపాడే ప్రాణదేవతయే పదోప్రాణం. ఆమే పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాస, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ- అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్యప్రాణదేవత పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ఈ ముఖ్యప్రాణదేవత యొక్క అవతారాలు.

నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్రమనే గ్రంథం ప్రకారం రాత్రిః అంటే జ్ఞానమునిచ్చేవాడు, జ్ఞానదేవత అనే అర్ధం ఉంది. అలాగే రాత్రి శబ్దానికి పరమేశ్వరి అని, నవ అనే శబ్దానికి పరమేశ్వరుడనే అర్ధాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల సమారాధనమే నవరాత్రవ్రతం. నవదుర్గా అవతర రహస్యాలు: నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం- అమ్మవారి అలంకారాలు. రాక్షస సంహార క్రమం దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక్క అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదోరోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ” నవ దుర్గా రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి.

దేవీభాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేవి నవదుర్గా రూపాలు, ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్మాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.
శైలపుత్రి :
పర్వత రాజు హిమవంతుని కుమార్తె శైలపుత్రి. పర్వతానికి శైలం అనే పేరు ఉంది. ఈ విధంగా పర్వతరాజుకు జన్మించిన శక్తి శైలపుత్రిగా వినుతికెక్కింది. ఈమె కుడి చేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఉంటుంది. తలపై చంద్రవంక ఉంటుంది. పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఈమెకు ఉన్నాయి. భక్తవాత్సల పూరితగా ఈమె భక్తుల నీరాజనాలందుకుంటున్నది.
బ్రహ్మచారిణి :
పరమశివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేసిన పార్వతీ రూపం బ్రహ్మచారిణిగా ప్రసిద్ధి పొందింది. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి ఉంటుంది.మిక్కిలి జ్యోతిర్మయంగా ఈ స్వరూపం ఉంటుంది. బ్రహ్మచారిణిగా దుర్గాదేవిని ఉపాసిస్తే ఏకాగ్రత కలిగి, భగవత్త్వం మీద మనసు నిలుస్తుందని ఋషివాక్యం.
చంద్రఘంట :

చంద్రుని వంటి స్వచ్చమైన పాత్రను చేతిలో ధరించి, నిత్యానందం అనే మధువును పానం చేసే దుర్గారూపాన్ని చంద్రఘంటగా ఋషులు పేర్కొన్నారు. శిరస్సుమీద అర్దచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈమెకు చంద్రఘంట నామం సార్ధకమైంది. బంగారం వంటి శరీరకాంతితో పదిచేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. సింహవాహినియై ఎల్లప్పుడూ యుద్దసన్నాహమై ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే మనస్సులోని కుత్సితం, క్రూరభావం నశిస్తాయి. పరాక్రమం, నిర్భీతి కలుగుతాయి

.
కూష్మాండ :
లోకంలో దుఃఖబాధలు ఆధ్మాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం అని మూడు విధాలుగా ఉంటాయి. ఈ మూడు తాపాలు కలిగిన సంసారమనే జగత్తు యొక్క అండాన్ని ఉదరంలో ధరించే రూపాన్ని కూష్మాండంగా శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. నిరుపమాన తేజస్సుతో సూర్యమండలాంతర్వర్తినిగా ఉంటుంది. బ్రహ్మండంలోని సకల ప్రాణుల్లోని జీవశక్తి ఈమె తేజోరూపమే. ఏడుచేతుల్లో వరుసగా కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులను ప్రసాదించే జపమాల ఉంటుంది. ఈమె కూడా సింహవాహిని, భక్తుల రోగ, శోకాలను నాశనం చేస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలను వృద్ధి చేస్తుంది.

స్కందమాత :
దేవతల సేనా నాయకుడైన కుమారస్వామికి జన్మనిచ్చిన తల్లిగా దుర్గాదేవిని భక్తులు స్కందమాత రూపంలో ఆరాధిస్తారు. ఈమె చతుర్భుజ. బాలస్కందుని తన ఒడిలో పట్టుకుని ఉంటుంది. పద్మం, అభయముద్ర, కమలం ధరించి ఉంటుంది. ఈమె సూర్యమండల అధిష్టాత్రి. ఈదేవి ఉపా సన వల్ల దివ్య తేజస్సు వస్తుంది. గర్భిణులు స్కందమాతను అర్చిస్తే గర్భశుద్ధి కలిగి జ్ఞానవంతులైన సంతానాన్ని పొందుతారు. జన్మరాహిత్యం కలుగుతుంది.

కాత్యాయని :
త్రిమూర్తుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట అవతరించిన మూర్తి కాత్యాయనీదేవి. ఈ దేవి ఉపాస న అమోఘ ఫలితాలనిస్తుంది. కృష్ణావతారంలో గోపికలు కాత్యాయనీ దేవిని పూజించారు. బంగారు వర్ణంతో దివ్య తేజస్సు కలిగి ఉంటుంది. వరద, అభయ ముద్రలు, ఖడ్గం, పద్మం ధరించి, భక్తుల అర్చనలు అందుకుంటుంది. ధర్మార్థ కామ మోక్షాలు ఈ దేవి ఉపాసన ద్వారా సంప్రాప్తం అవు తాయి.

కాలరాత్రి :
ఈమె ఏడవ దుర్గ. పరాహపురాణంలో మృత్యువుకే భయం కలిగించే శక్తిగా ఈమెను వర్ణించారు. ఈమె శరీర వర్ణం గాంఢాంధకారం వలే ఉంటుంది. మెడలలోని హారం నుంచి విద్యుత్కాంతులు వస్తుంటాయి. ఈమె శ్వాస నుంచి అగ్ని జ్వాలలు వెలువడుతుంటాయి. గార్ధభ వాహనాన్ని అధిరోహించి, ఇనుప ముళ్లు కలిగిన గద, ఖడ్గం ధరించి ఉంటుంది. ఈ అమ్మనామ స్మరణతోనే భూత ప్రేత పిశాచాది సర్వరాక్షస శక్తులు నిర్జీవం అవుతాయి. ఈ తల్లి కృప వల్ల భయ విముక్తి కలుగుతుంది.

మహాగౌరి :
అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. ఈమె ఉపాసన సద్యఃఫలదాయకమై, భవిష్యత్తులో సైతం పాపచింతనలు దరిచేయనీయదు. అసంభవాలైన కార్యాలు సాధించడానికి ఈ తల్లి అనుగ్రహం ఎంతో అవసరం.

సిద్ధిదాత్రి :
అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మ రూపం ” సిద్ధిద లౌకిక, అలౌకిక సర్వార్ధ సిద్ధులకు ఈమె ను అధిష్టాన దేవతగా శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సర్వకార్య సాధక స్వరూపం సిద్ధిద. పరమశివుని అర్ధభా గంగా ఉన్న ఈమె చతుర్భుజాలతో భక్తుల పూజలం దుకుంటుంది. ఈమె కమలాసన. మరొక కమలాన్ని చేతిలో ధరించి ఉంటుంది. ఈమెను నిష్టతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. అంత్యకాలంలో పరమ పదాన్ని చేరుకుంటారు.

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా

”హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తకపాశమంకుశ ధరాం సగ్భ్రూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీంII దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా అమ్మను పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. కానీ ఈ అవతారంలో అమ్మవారి అలంకారం పూర్తిగా వస్త్రాలతో సహా స్వర్ణమయమై ఉంటుంది.

విజయవాటిక (ప్రస్తుతం విజయవాడ)ను పరిపాలించిన మాధవవర్మ అనే రాజు ధర్మనిరతికి మెచ్చిన అమ్మవారు విజయవాడలో కనకవర్షం కురిపించింది. అందుకు గుర్తుగా ఆనాటి నుండి దసరా ఉత్సవాలలో మొదటి రోజున అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరించడం ఆనవాయితిగా వచ్చింది. ఈ అవతారంలో అమ్మవారి దర్శనం సకల పాపాలను పోగొట్టి, లౌకిక సంపదలు చేకూరుస్తుంది. అలంకారం: అమ్మవారికి అలంకరించే పట్టుచీర బంగారు వర్ణంతో జరీ అంచు కలిగి స్వర్ణకాం తులతో ధగధగలాడు తుంది.

మంత్రం: ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఎరుపు, పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. నైవేధ్యం:అమ్మవారికి పులిహోర, పొంగలి నివేదన చేయాలి.