దేవర లో మరో పాన్ ఇండియా స్టార్

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఈ చిత్రం తాలూకా విశేషాలు బయటకు వస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ లో KGF ఫేమ్ తారక్ పొన్నప్ప నటిస్తున్నట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ లో కీలక పాత్రలో నటించిన ఈయనకు పాన్ ఇండియా గుర్తింపు లభించింది. కేజీఎఫ్ లో ఇతడు పోషించిన పాత్ర చిన్నదే అయినా కూడా గుర్తుండిపోయే పాత్ర దక్కింది. ఈ క్రమంలో ఈయనను దేవర లో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ లో హీరోయిన్ జాన్వీ పాత్ర కు సంబంధించి కూడా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక మత్స్యకారుని కూతురుగా కనిపించనుందట. సినిమాలో ఎక్కువ శాతం లంగా ఓణి మరియు పల్చటి చీర కట్టులో కనిపించబోతుందట. లంగా ఓణి మరియు చీర కట్టు లో చూపించాల్సినంత అందాలను జాన్వీ కపూర్ చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ఆమె పోస్టర్ ను చూస్తే అర్థం అవుతుంది.