దృఢమైన విశ్వాసంతో సేవించాలి

Lord Krishna
Lord Krishna

దృఢమైన విశ్వాసంతో సేవించాలి

ఆలోచనాపరుడూ జిజ్ఞాసువైన సాధకుడు ఆధ్యాత్మిక ప్రబోధాలను సత్యాలను గుడ్డిగా నమ్మాడు. ఉన్నత స్థాయి వ్యక్తులతో చర్చించి, తర్కించి నిజానిజాలు నిగ్గు తేల్చుకున్న తర్వాతనే ఒక అవగాహనకు వస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడే అయిన భగవంతుడు కేవలం భక్తుల ప్రార్థనలను ఆలకించి వారి కోరికలను తీరుస్తాడనుకోవడం నిజాయితీపరుడైన సాధకుడికి హేతువిరుద్ధంగా తోస్తుంది. ప్రార్థించిన భక్తుల కోరికలు మాత్రం తీర్చే భగవంతుడు పక్షపాతి అను కుంటాడు. అయితే అలా ఎన్నటికీ, ఎప్పటికీ జరగదు. ఇందులో సామాన్య బుద్ధికి అంతుబట్టని ఏదో అంతరార్థం ఉంది. మరి భగవంతు డు భక్తుల కోరికలను ఎలా తీర్చగలుగుతున్నాడు. ”సకామ భక్తుడు ఏయే దేవతా స్వరూపములను భక్తిశ్రద్ధలతో ప్రార్థించ నిశ్చయించుకుంటాడో భక్తునకు ఆయా దేవతల యందున్న భక్తిశ్రద్ధలను మరింత పెంపొందించి సుస్థిరపడేట్లు చేస్తాను అంటాడు కృష్ణపరమాత్మ. మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దృఢమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి.

లక్ష్యం పట్ల మనకున్న అచంచల శ్రద్ధా విశ్వాసాలు బలీయంగా ఉన్నప్పుడే అది సాధ్యమవ్ఞతుంది. లక్ష్యం ఏదైనా కావచ్చు. గట్టిపట్టుదల శ్రద్ధ దానిని సిద్ధించేలా చేస్తుంది. భక్తుని శ్రద్ధా విశ్వాసాలను బలవత్తరం చేసేది నేనే అని నొక్కి చెబుతున్నాడు (తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ వివిధామ్యహమ్‌) కృష్ణపరమాత్మ. భౌతిక దృష్టితో చూసినప్పుడు కూడా మానవ్ఞడు ఏ లక్ష్యం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులు చూపుతాడో ఆ శ్రద్ధాసక్తుల్ని బలవత్తరం, శక్తిమంతం చేస్తాడు భగవంతుడు. విశ్వాసం పెరిగే కొద్దీ దాని ప్రేళ్లు అంతరంగంలోకి చొచ్చుకు పోతాయి. మనసు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత ఎటువంటి అవరోధాలనైనా ఎదుర్కోగల మహత్తర శక్తినిస్తుంది.

లక్ష్యం పట్ల మనకున్న శ్రద్ధా విశ్వా సాలు స్థాయిపై మన విజయం ఆధారపడి ఉంటుంది.

ముందు మనలో విశ్వాసం అంకు రించాలి. ఆ విశ్వాసం క్రమక్రమంగా దృఢతరం కావాలి. అందుకు తోడు మనం చేస్తున్న ప్రయ త్నాలు తీవ్రంగా ఉండాలి. అప్పుడు మన కోరికలు, అభీష్టాలు సాఫల్యం చెం దుతాయి. కొందరు ”ఎన్నో ఏళ్లుగా భక్తివిశ్వాసాలతో మేం ప్రార్థనలు చేస్తు న్నాం కాని నిష్ప్రయోజనం. మా కష్టాలు, బాధలూ అలానే ఉన్నాయి అని వాపోతారు. భగవత్‌ శక్తినే శంకిస్తారు. అందుకు కారణం వాళ్ల భక్తివి శ్వాసాల బలహీనత. శ్రద్ధారాహిత్యం, నిష్క్రియా పరత్వం. వాళ్లు దేవ్ఞని ఎదుట బిచ్చగాళ్లలా దేబి రిస్తున్నారు. దైవ సమక్షంలో క్రియాశూన్యులైన యాచకులకు స్థానం లేదు.

నిరంతర కృషికులైన భక్తుల ప్రార్థన మాత్రమే ఫలిస్తుంది. ఇదే విజయ రహస్యం. లౌకిక, అలౌకిక విజయాలకు ఇదే సూత్రం. మనకున్న అద్భుత మనశ్శక్తి సంకల్పాలతో సక్రమమైన క్రియాశీలతతో భౌతిక సుఖాలతో బాటు మహత్తర ఆధ్యాత్మికానుభూతులను పొందవచ్చు. మన చంచలమైన మనస్సుకు ఏకాగ్రత, సుస్థిరమైన లక్ష్యం ఉండదు. మన శ్రద్ధా విశ్వాసాలు అనుక్షణం మారిపోతుంటాయి. మన బలహీనమైన కరికలు దేనినీ సాధించలేవ్ఞ. ఇచ్ఛాశక్తి ఉండి కూడా దానిని క్రియాశీలంగా దైవం వైపు మరల్చకుండా ఉంటే అది నిరుపయోగమై పోతుంది.

పనిముట్టు పనికి తగినట్లుగా ఉండాలి. ఉపయోగించే వ్యక్తి ఎంతటి బలశాలి అయినా పనిము ట్టుకు ఉండవలసిన సూక్ష్మత లేనప్పుడు ఆ బలం నిరుపయోగమవ్ఞతుంది. కనుక మనం ఇచ్ఛాశక్తితో క్రియాశక్తినీ, జ్ఞానశక్తినీ మిళితం చేయాలి. అప్పుడు మనం సర్వం సాధించుకోవచ్చు. చెదరిపోతున్న మనసుని సంఘటితం చేసి, స్థిరపరచి ప్రశాంతతను కల్పించి జీవితానికి శాంతినీ, కాంతినీ ప్రసాదించేది ప్రార్థన ఒక్కటే. ”ఆత్మకు ఆహారం ప్రార్థన అన్నారు అనుభవజ్ఞులు.

– స్వరోచి