దూసుకెళ్తున్న అరజెంకా
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ స్పెయిన్ కుచెందిన ముగురుజా 3వ రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. జకోస్లోవేకియాకు చెందిన ఆన్ సీడెడ్ క్రీడాకారిణి స్ట్రైకోవా 6-3, 6-2, స్కోరుతో ముగురుజా ను ఓడించి 4వ రౌండ్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో 14 సీడ్‌గా బరిలోఉన్న అజిరెంకా 4వ రౌండ్‌కు దూసుకెళ్లింది. మెల్బోర్న్ రాడ్‌లేవర్ ఏరినాలో శనివారం జరిగిన మూడో రౌండ్లో అజిరెంకా 6-1,6-1 స్కోర్‌తో 11వ సీడ్ జపాన్‌కు చెందిన ఒసాకాపై విజయం సాధించి 4వరౌండ్కుచేరుకుంది. పురుషుల విభాగంలో 4వ సీడ్ వావ్రింకా 6-2, 6-3, 7-6 తేడాతో రోసోల్ను ఓడించి 4వ రౌండ్‌కు చేరుకున్నాడు.