దూరం నుంచి వచ్చే విమర్శల వల్లే మేలుకొలుపు

sunil gawasker, ravi shastri
sunil gawasker, ravi shastri

సిడ్నీ: ఆసీస్‌ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయానికి టీమిండియా అత్యంత చేరువలో ఉంది. ఐతే ఈ సమయంలో మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కోచ్‌ రవిశాస్త్రికి పంచ్‌ వేశాడు. ఆసీస్‌ గడ్డపై తొలి టెస్టులో గెలిచే సరికి శాస్త్రి కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ..వేల కిలోమీటర్ల దూరం నుంచి విమర్శలు చేయడం చాలా తేలిక అని అన్నాడు. ఇదే విషయాన్ని గవాస్కర్‌ ప్రస్తావించాడు. ఆదివారం నాలుగోరోజు ఆట ముగిసిన తర్వాత మురళి కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌పై విశ్లేషణ చేసిన సందర్భంగా సన్నీ చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. పెర్త్‌ టెస్టు భారత్‌కు ఒక మేలుకొలుపు అని కార్తీక్‌ అన్నాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న గవాస్కర్‌ మాట్లాడుతూ..మరి ఆ మేలుకొలుపు ఎలా వచ్చింది, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల విమర్శల నుంచే వచ్చింది అని గవాస్కర్‌ అన్నాడు.