దుస్తులపై మరకలు పోవాలంటే

HOUSE
HOUSE


దుస్తులపై మొండి మరకలు పోవాలంటే వంటింటి చిట్కాలను ప్రయత్నించాల్సిన అవసరం లేదు. స్టెయిన్‌ రిమూవల్‌ ఉపయోగించడానికి ముందు దానికి కొంత భాగంలో ప్రయత్నించి పరీక్షించాలి. ఉదాహరణకు ఎంతో అందమైన మీ పసుపురంగు జాకెట్‌పై కాఫీ మరకలు పడ్డాయనుకోండి. స్టెయిన్‌ రిమూవల్‌ రంగుని పోగొట్టదని, అది బ్లీచింగ్‌ కాదని నిర్ధారించుకోవడానికి పైకి కనిపించని బాగంలో ఆ ద్రావణాన్ని ఉపయోగించాలి. ఆపై బట్ట చెక్కు చెదరకుండా ఉంటే స్టెయిన్‌ రిమూవర్‌ను నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు. బట్టలపై మరకలు పోగొట్టడానికి, డ్రైక్లీనింగ్‌ బిల్లుని ఆదా చేయడానికి డై హక్స్‌ని స్వయంగా ఉపయోగించవచ్చు. టీ లేదా కాఫీ మొండి మరకలను తొలగించే సులువైన మార్గం. మరకలు పడిన భాగాన్ని ఒక గిన్నెలో ఉంచి, దానిలో వేడి నీరు పోసి ఆ భాగాన్ని సున్నితంగా రుద్దాలి. ఆపై నీటిని పిండి బట్టను చదునుగా పరచాలి. ఇప్పుడు వంట పాత్రల ద్రావణం, తెల్లని వెనిగర్‌, నీటిని సమాన కొలతలతో కలపాలి. టూత్‌బ్రష్‌ను ఈ ద్రావణంలో ముంచి మరకలపై నెమ్మదిగా రుద్దాలి. తరువాత వెంటనే ఆ దుస్తులను వాషింగ్‌ మెషిన్‌లో శుభ్రం చేయాలి. గడ్డి లేదా ఎండిన బురద మరకలని సున్నితంగా రుద్దాలి. తరువాత మరక పడిన భాగాన్ని డిటర్జెంట్‌, వేడి నీటితో కడగాలి. ఇప్పుడు తెల్లని వెనిగర్‌, నీటిని సమపాళ్లలో కలిపి ఆ ద్రావణాన్ని మరకలపై రుద్దాలి. చివరగా బట్టలను శుభ్రంగా ఉతకాలి. దాంతో బట్టలపై పడిన మరకలు మాయమవుతాయి. చెమట అనేది ప్రొటీన్‌ ఆధారితమైనది కాబట్టి ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేసే మీట్‌ టెండరైజర్‌ చెమట వల్ల ఏర్పడిన మొండి మచ్చలపై చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా మచ్చలు పడిన భాగాన్ని తడిపి, దానిపై మీట్‌ టెండరైజర్‌ను చల్లి, కొంతసేపు అలానే ఉంచి తరువాత శుభ్రంగా కడిగేయాలి. రెండవది వంట పాత్రలను తెల్లగా మెరిసేలా చేసే ద్రావణం. ఒక వంతు పాత్రల ద్రావణంలో రెండు వంతుల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపగా వచ్చిన ద్రావణంతో మచ్చలు పడిన భాగాన్ని సున్నితంగా రుద్ది, ఒక గంట తరువాత దానిని శుభ్రం చేయాలి. నీటిని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి, దానిని మచ్చలపై వేసి కొన్ని నిమిషాలు అలానే ఉంచి ఆ తరువాత దానిని వాషింగ్‌ మెషిన్‌లో ఉతకాలి. చెమట వలన ఏర్పడిన మరకలు పోగొట్టడంలో ఈ చిట్కా తిరుగులేనిది. కెచప్‌ వంటి వాటికి చల్లని నీటిని మరక వెనుక భాగంలో రుద్దాలి. నీరు శుభ్రాంగా మారే వరకు రద్దుతూనే ఉండాలి. ఆపై డిటర్జెంట్‌తో రుద్ది నీటిలో పిండాలి. తరువాత తెల్లని వెనిగర్‌ను మరకలపై వేసి కొంతసేపు ఉంచి ఆపై దానిని శుభ్రంగా ఉతకాలి. కెచప్‌ మరకలు మాయం.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/