దుల్కర్ సల్మాన్ అభిమానిని

RAjamou222
Rajamouli

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించారు. ఈరోజు ఉదయం సినిమా మొదటి షోను చూసిన ప్రేక్షకులతో కలిసి వీక్షించారు ఎస్.ఎస్.రాజమౌళిగారు. సినిమా పూర్తయ్యాక ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన సినిమాపై ప్రసంశల వర్షం కురిపించారు. సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేష్ నటన అద్భుతమని, ఆమె సావిత్రిగారిని అనుకరించడమే కాదు ఆమెను సరాసరి మన జీవితాల్లోకి తీసుకొచ్చేసిందని, దుల్కర్ సల్మాన్ నటన కూడ అద్భుతమని, ఇప్పటి నుండి అతనికి అభిమానిని అయిపోయానని, నాగ్ అశ్విన్, స్వప్నల అంకితభావం గొప్పవని అన్నారు. ప్రేక్షకులు సైతం సినిమా పట్ల పాజిటివ్ గా స్పందిస్తూ కీర్తి సురేష్ నటనను కొనియాడుతున్నారు.