దుర్గ‌గుడి ఈవో సూర్య‌కుమారికి ఉద్వాస‌న‌

Surya kumari
Surya kumari

అమరావతి: బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం విధుల నుంచి తొల‌గించింది. . ఆమె బాధ్యతల్ని దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధకు అప్పగించారు. ఆలయంలోకి బయటి వ్యక్తులు వచ్చినట్లుగా విచారణలో వెల్లడైందని, సూర్యకుమారి ఈవోగా కొనసాగితే విచారణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. పరిపాలనా లోపాలు వెలుగుచూసినందువల్లే సూర్యకుమారిని బాధ్యతల నుంచి తప్పించినట్టు చెప్పారు. ఆలయంలో అర్థరాత్రి పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.