దుర్గగుడి వ్య‌వ‌హారంలో సీఎంను కలిసిన మంత్రి మాణిక్యాలరావు

Manikyala rao
Manikyala rao

విజయవాడ: దుర్గ గుడలో తాంత్రిక పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ విషయమై చర్చించేందుకు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో మంత్రి మాణిక్యాల రావు భేటీ అయ్యారు. అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ దుర్గ గుడిలో తప్పు జరిగిన మాట వాస్తవమేనని, ఈ ఘటనపై 48గంటల్లోగా తమకు నివేదిక వస్తుందని, దీని ఆధారంగా చర్చలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఏ స్థాయి వ్యక్తి ఉన్నా ఉపేక్షించబోమని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.