దుప్పి రక్తంతో స్నానం చేస్తున్న ఫుతిన్‌?

putin
putin

మాస్కో: రష్యాలో ఒక వింత మూఢనమ్మకం హల్‌చల్‌ చేస్తుంది. రాయల్‌స్టాగ్‌(దుప్పి) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో
కొందరు స్నానాలు చేస్తుంటే, మరికొందరు మంచినీరులా సేవిస్తున్నారని రష్యన్‌ మీడియా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు
వ్లాదిమర్‌ ఫుతిన్‌ లైంగిక సామర్ధ్యం పెంపొందిచుకునేందుకై దుప్పి రక్తంతో స్నానం చేస్తారట. ఈ విషయం రష్యాలోని
టెలివిజన్‌ ఛానల్‌ ద్వారా తెలిసింది. ఈ రక్తంతో చాలా శారీరక సమస్యలు నయమవుతాయని వారి నమ్మకం. కేవలం
పది లీటర్ల రక్తమే వంద డాలర్ల విలువ చేస్తుంది.