దుంప పచ్చడి

RUCHI
RUCHI

దుంప పచ్చడి

కావలసినవి

మామిడికాయలు-2 చిలగడదుంపలు-6 నూనె-100గ్రా ఎండుమిర్చి-9 ఇంగువ-కొద్దిగా ఉప్పు, పసుపు-తగినంత మెంతులు-కొన్ని ఆవాలు-రెండు స్పూన్లు

తయారుచేసే విధానం
మామిడికాయలను చిలగడదుంపలను శుభ్రంగా కడిగి చెక్కుతీసి తురుముకోవాలి. బాణలిలో నూనె కాగాక మెంతులు, మిర్చి, ఇంగువ, ఆవాలు వేసి వేయించుకోవాలి. వేయించి మిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసి నలగనివ్వాలి. తురిమిన కోరు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేసుకోవాలి. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి రెండు రోజుల వరకు బాగుంటుంది.