దీపోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకం

ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవ వేడుకల్లో చంద్రబాబు

Chandrababu
Chandrababu

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, పూరీ పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామివారితో కలిసి కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని చెప్పారు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. అజ్ఞానాధకారాన్ని తొలగించి, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆథ్యాత్మిక గొప్పదనమని చెప్పారు. కార్తీక మాసం అనగానే శివార్చన, అభిషేకాల మాదిరిగానే కోటి దీపోత్సవం కూడా గుర్తొచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/