దీపం ఉండగానే

Shirdi Saibaba
Shirdi Saibaba

దీపం ఉండగానే

మానవ జన్మ ప్రాముఖ్యాన్ని తెలుపని వారుండరు. కానీ, తెలుసుకున్నవారు తక్కువగానే ఉంటారు. ఇంకా ఆ విషయం తెలుసుకొని ఆచరణలో పెట్టువారు ఇంకా తక్కువగా ఉంటారు. అట్టివారు అంటే ఆచరణలో పెట్టిన వారే కృతార్థులవ్ఞతారు. సాయిబాబా పఠింపమని తెల్పిన ఏకనాథ భాగవతంలో అవధూతగా గురువ్ఞ నరదేహా ప్రాశాస్త్యాన్ని వివరించాడు. సృష్టిలో భగవానుడు మనుష్య దేహంలో జ్ఞానం నింపి పెట్టాడు. ఆజ్ఞానంతో సచ్ఛిదానంద పదవిని పొందవచ్చును. అంతటి అవకాశం, అధికారం కేవలం మానవజన్మకే పరిమితమై ఉన్నాయి. నరదేహం ప్రాప్తించినప్ఞడు ఎవరు బ్రహ్మ సాధన చేయరో వారు జనులలో మహామూర్ఖులు, దేవ్ఞని పట్ల విశ్వాసఘాతకులు.

సాయి సచ్ఛరితలో హేమాడ్‌పంత్‌ ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైనా వృధా చేయకండి. క్షణభంగురమైన మానవ శరీరంలో ముక్తిని సంపాదించి పెట్టే శ్లోకాలు, కథా వార్తలు వినే సమయం సార్థకం అవ్ఞతుంది. మిగిలిన కాలం వ్యర్థం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు. అలా చేసుకున్నవారే ఆధర్మంగా నిలిచిపోతారు చరిత్రలో. తన మరణకాలం పరీక్షిత్తు మహారాజు తన వద్దకు వచ్చిన ఆత్మతత్వజ్ఞులతో ఆయన ఏడుదినాలలో మోక్షం ప్రాప్తించే విధానం తెలపండి అని ప్రాధేయపడ్డాడు.

అదే సమయంలో శుకమహర్షి రావటం జరిగింది. పరీక్షిత్తు ఆయనను కూడ వేడుకున్నాడు. రాజా! విను.. ఏడు రోజుల తర్వాతనే కదా మరణం. అంతవరకు పరలోక శుభాన్ని అర్జించటానికి అవకాశం ఎంతో ఉన్నది, అని భాగవత ప్ఞరాణం శ్రవణం చేయించాడు. అది వ్యాసభగవానునిచే విరచితమైనది. భాగవతం సద్యోముక్తి ప్రదాత. అది శీఘ్రగతిలో ముక్తిని ప్రసాదించే సులభసాధనం. అలా శ్రవణం చేసిన పరీక్షిత్తు కైవల్యాన్ని పొందాడు. ముందు కైవల్యాన్ని పొందాలనే ఆలోచన ధృడంగా ఉంటే ఏర్పాటు తరువాత చేసుకోవచ్చు.

మరో ఉదంతం ఉన్నది. ఖద్వాంగ మహారాజు మహాశౌర్యవంతుడు. ఒకసారి ఆయన ఇంద్రాది దేవతలకు సహాయం చేసి, దానవ సంహారం చేశాడు. దేవతలు వరం కోరుకోమన్నారు. నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అని కోరాడు మహారాజు. నీకు ఆయువ్ఞ ముహుర్త కాలమే అన్నారు వారు. వెంటనే విమానమెక్కి రాజ్యానికి వచ్చి, సర్వస్వాన్ని ప్రగాఢ వైరాగ్యంతో పరిత్యజించాడు. గోవింద నామం సంకీర్తన చేస్తూ మరణభయంకితుడై మోక్షం పొందాడు. అయితే అందరకూ మరణసమయం తెలియదుకదా! అందుకని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– యం.పి.సాయినాధ్‌