దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ

G. Jagadish reddy
G. Jagadish reddy

సూర్యాపేట: జిల్లాలో కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అదే విధంగా బదిరులకు ఫోన్‌లు పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సురేంద్రమోహన్‌, జెసి సంజీవ్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.