దివాలా చట్టం మాల్యాపై ప్రయోగించలేమా?

MALLYA
సరిహద్దు దివాలా సమస్యలకు అవకాశంలేదు
న్యూఢిల్లీ : కార్పొరేట్‌ రంగంలో దివాళా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివాలా నియమావళి 2015 అమ లులోకి వచ్చినప్పటికీ సరిహద్దువివాదాలకు ఈ నియమావళి ఎంతమాత్రం పనికిరాదని తేలింది. ప్రస్తుతం కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణబకాయిల వంటి వాటి రికవరీకి ఈ చట్టాలు కూడా ఎంత మాత్రం ఉపకరించవని స్పష్టం అయింది. వాస్తవా నికి ఈ తరహా రుణాల పరిష్కారానికి కూడా ఈ చట్టంలో ఒక అంశంగా చేర్చాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ అంశాలను చేర్చలేదు. భారత్‌లో పరిశ్రమలు నెలకొల్పి విదేశాల్లో నివసిస్తూ పన్ను వివాదాలు, రుణబకాయిలు వంటి వాటి పరిష్కారానికి దివాలా కొత్తబిల్లు ఏమాత్రం ఉపకరిందు. ప్రస్తుతం మౌలికవనరులు, ఇందుకు సంబంధించిన కొత్త అంశాల రూపకల్పన అవసరంఅవుతుందని దివాలా సంస్కరణల కమిటీ ఛైర్మన్‌ టికె విశ్వనాధ న్‌ వెల్లడించారు. దివాలా చట్టాలకు సం బంధించిముసాయిదా రూపకల్పన ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈబిల్లు ఆమోదం పొందుతున్న ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా మరో మూడునెలల వ్యవధి పడుతుందని అన్నారు. విదేశీ కంపెనీల నిపుణులు కూడా దివాలా చట్టం రూపకల్పనలో భాగస్వాములు కావాల్సి ఉంటుందని ఈవిధానం ప్రస్తుతం అనుమతించడంలేదని ఆయన అన్నారు. మాల్యా కేసులో ఈ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రెండువైపులా పరస్పరసహకారం అవసరమని స్పష్టం అవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాణిజ్య న్యాయ సూత్రాల ఆధారంగా కేసులు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దివాలా పిటిషన్‌ విచారణకు స్వీకరించిన తర్వాత ఒక స్వతంత్ర ప్రతినిధి చేతుల్లోనికి కంపెనీ వెళుతుంది. ప్రమోటర్లు, డైరెక్టర్లకు కంపెనీ వ్యవహా రాల్లో ఎటువంటి సంబంధం ఉండదు. స్వతంత్ర ప్రతినిధి పర్యవేక్షణలో ఉన్న సమయంలో ప్రమో టర్లు కానీ డైరెక్టర్లు కానీ కంపెనీకి సం బంధించిన నిధులు, ఆదాయాలు రాబడులను మళ్లించే అవకా శమే ఉండదని ఈచట్టం స్పష్టం చేస్తోంది. అయితే సరిహద్దుదివాలా అంశం ప్రస్తుత దివాలా నియమా వళి బిల్లులో చేరిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుంది. అయితే అందుకు విదేశీ కార్పొరేట్‌ వృత్తి నిపుణుల భాగస్వామ్యం కూడా అవసరం అవుతుం ది. ప్రస్తుత చట్టాల్లో ఇందుకు అవకాశం లేదని ఈ కమిటీ రూపశిల్పి విశ్వనాధన్‌ స్పష్టం చేశారు.