దిగుమతి సుంకాలతో స్టీల్‌ కంపెనీలషేర్లకు జోష్‌!

STEEL
STEEL

న్యూఢిల్లీ: ప్రస్తుతం స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతులపై 5నుంచి 12.5శాతం ట్యారిఫ్‌లు అమలవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేశాయి. వీటిని 15శాతం వరకూ పెంచే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలియచేశాయి. ఈ నేపథ్యంలో మెటల్‌ రంగ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2శాతం పెరిగింది. అయితే వివిధ రకాలుగా చూస్తే జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ దాదాపు 4 శాతం పెరిగి రూ.422 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, నేషనల్‌ అల్యూమినియం, టాటా స్టీల్‌, హిండాల్కో, కోల్‌ ఇండియా 3.75 నుంచి 2 శాతం మధ్య పెరిగాయి. మిగిలిన మెటల్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, హింద్‌ కాపర్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, హింద్‌ జింక్‌, ఎంవోఐఎల్‌, ఎన్‌ఎండిసి 1.5శాతం నుంచి 0.5శాతం మధ్య పెరిగాయి. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో స్టీల్‌ ఉత్పత్తుల నికర దిగుమతిదారుగా దేశం నిలవడం కూడా దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 3.5శాతం పెరిగి రూ.421 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.424 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. దీని టార్గెట్‌ ధర రూ.484 ఉండడంతో కొనుగోలు రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియచేసింది. తక్కువకు ఉత్పత్తులను తయారుచేయగల సామర్థ్యం కంపెనీకి ఎక్కువ బలమని పేర్కొనడంతో ఈ షేరు లాభాల్లో దూసుకెళుతోంది.