దిగివచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

bse11
BSE

దిగివచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ, జనవరి 15: రిటైల్‌ద్రవ్యోల్బణానికి పెద్ద నోట్లసెగ తగిలింది. డిసెంబరునెలలో 3.41శాతం గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగదు సంక్షోభం డిమాండ్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచిందని అంచనా. దీనివల్ల వచ్చే ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనా. వడ్డీరేట్లకు కీలకప్రామాణికంగా భావించే రిటైల్‌ద్రవ్యోల్బణం 3.4శాతంగా నిలిచింది. అంతకుముందు నెల లో 3.6శాతంగా నమోదయింది. ఆహారద్రవ్యో ల్బణంపరంగా 15నెలల కనిష్టస్థాయిలో అంటే 1.34శాతంగా నమోదయింది. గతనెలలో 2.03 శాతంగా ఉంది. రైతులవద్దనుంచి కొనుగోళ్లకు పెద్ద నోట్ల రద్దు ఎక్కువ విఘాతం కలిగించింది. ఆహా రేతర ఉత్పత్తులు దుస్తులు, హౌసింగ్‌ ఇతరత్రా ఐదుశాతంగా ఉన్నాయి. గతనెలలోనే రిజర్వుబ్యాం కు వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25శాతానికి తెచ్చింది. పప్పుదినుసుల్లో కూడా తగ్గుదల నమోదయింది. ఇంధన ధరలపరంగా 3.77శాతంగా ఉంది. ఇక దుస్తులు, పాద రక్షలధరలపరంగా 4.88శాతం, 4.98 శాతం తగ్గినట్లు నిపుణులు అంచనావేస్తు న్నారు. 2010 నుంచి 2012వ సంవత్స రానికి ప్రామాణిక సంవత్సరంగా గుర్తిస్తూ అర్ధగణాంకశాఖ సవరణలు తెచ్చినతర్వాత రిటైల్‌ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోంది. 2014 నవంబరులో 4.38శాతం ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆ తర్వాత ఆరు శాతానికి పెరిగింది. క్రమేపీ తగ్గుతూ డిసెంబరు నాటికి 3.40శాతానికి దిగివచ్చిందని అంచనా.
=====