దావూద్ కారు కొన్నారు.. కాల్చేశారు

davood car

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ పాత కారును హిందూమహాసభ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో బుధవారం దహనం చేశారు. దావూద్ ఆస్తులను ఇటీవల వేలంవేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 9న జరిగిన వేలంలో పురాతన హూందాయ్ కారును అఖిలభారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి దక్కించుకున్నారు. దానిని బుధవారం చక్రపాణి ఆధ్వర్యంలో దహనం చేశారు. మంటల్లో కాలుతున్న కారు ఉగ్రవాదానికి హెచ్చరిక అని చక్రపాణి అన్నారు. వేలంలో కొనుగోలుచేసిన కారును మొదట అంబులెన్సుగా మార్చాలనుకున్నానని, కానీ దావూద్ అనుచరులనుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపేందుకే ఈ చర్యకు పాల్పడినట్టు చక్రపాణి స్పష్టం చేశారు.